Nara Lokesh Love Story: నారా లోకేష్ విద్యాధికుడు. విదేశాల్లో చదువుకున్నారు. అటు తరువాత బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి సైతం అడుగుపెట్టారు. అయితే విద్యార్థిగా ఉండేటప్పుడు స్నేహితులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వైసిపి దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మొన్నటికి మొన్న సీఎం జగన్ సైతం లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడు ఒకడు అంటూ సీఎం సెటైర్ వేశారు. దీనికి లోకేష్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అయితే తాజాగా లోకేష్ తన లవ్ ట్రాక్ ని చెప్పుకొచ్చారు.
యువగళం పాదయాత్ర మంగళగిరికు చేరుకుంది. విద్యార్థులు, యువతతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలను నివృత్తి చేశారు. తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ విద్యార్థిని ఏకంగా మీ స్టూడెంట్ లైఫ్ లో ఫస్ట్ క్రష్ గురించి చెప్పాలని.. బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన ముందుగా ఎవరు తీసుకొచ్చారని అడిగింది. దీనికి లోకేష్ సమాధానమిచ్చారు. తాను చెబితే ముద్దుల మామయ్యకు కోపం వస్తుందని బాలకృష్ణను ఉద్దేశించి అన్నారు. అటు వైసిపి సోషల్ మీడియా పై సెటైరికల్ గా మాట్లాడారు. నేను ఏం చెప్పినా పేటీఎం బ్యాచ్ పలువలు చిలువలు చేస్తుందని అన్నారు. దీంతో అందరూ లోకేష్ కు లవ్ ట్రాక్ ఉందని భావించారు. ఏం చెప్తారా అని ఆత్రుతగా ఎదురు చూశారు. అటు ప్రాంగణమంతా ఈలలు, గోల తో మార్మోగింది.
అక్కడకు కొద్దిసేపటి తర్వాత లోకేష్ స్పందించారు.’ చెప్పమంటారా.. నాది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కానీ ముద్దుల మామయ్య దగ్గర అంత సాహసం చేసే వాడిని కాను’ అని చెప్పుకొచ్చారు. మా అమ్మా నాన్న తో బయటకు వెళ్ళినప్పుడు బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. సింగిల్ టేక్ లో ఎస్ అని చెప్పాను. అటు బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. అలా మా వివాహం జరిగిపోయిందని లోకేష్ చెప్పగానే యువత, విద్యార్థులు కేరింతలు కొట్టారు.