Game Of Thrones: గేమ్ ఆఫ్ థ్రోన్స్.. ఈ పేరు టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. ఏడు రాజ్యాలు, ఓ కాల్పానిక ఖండంలో మనుషులు, జంతువుల మధ్య జరిగే కథ. సిరీస్ రాజ్యానికి చెందిన రాజవంశీకుల మధ్య సింహాసనం కోసం జరిగే పోరాటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ డేవిడ్ బెనియాఫ్. 2011 ఏప్రిల్ 17 న HBO ఛానెల్ లో ప్రసారమై 2018 వరకు 8 సీజన్లు సాగింది. ఆ తరువాత దీనిని వెబ్ సిరీస్ గా తీర్చిదిద్ది నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ చేశారు. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. అయితే తెలుగులో రాలేదనే నిరాశ ఉండేది. కానీ ఇప్పుడు దీనిని ఓ డిజిటల్ సంస్థ తెలుగులో తీసుకురానుంది. ఆ వివరాల్లోకి వెళితే..
గేమ్ ఆఫ్ థ్రోన్స్.. HBO ఛానెల్ లో ప్రసారం అయింది. దీనిని డిస్నీ హాట్ స్టార్ లోనూ కొనసాగిస్తున్నారు. వీరి మధ్య జరిగిన ఒప్పందంతో వెబ్ సిరీస్ ను డిస్నీ హక్కులు పొందింది. గత మార్చిలో దీనిని డిస్నీ హాట్ స్టార్ నుంచి తొలగించారు. అయితే ఆ స్ట్రీమింగ్ ను జియో దక్కించుకుంది. ఇదే సమయంలో ఆడియన్స్ కు జియో గుడ్ న్యూస్ చెప్పింది. దీనిని ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ప్రసారం చేయాలని అనుకుంటోంది.
తెలుగులో వచ్చిన బాహుబలి సినిమా కు మించి ఈ సినిమా ఉంటుందని దీనిని చూసిన వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఆప్పట్లో కొన్ని సీన్స్ ఇందులో నుంచి కాపీ చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలుగులో నేరుగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆకట్టుకుంటున్న జియో ఈ మూవీని తెలుగులో తీసుకొస్తుందని తెలియడంతో చాలా మంది జియో సినిమాను డౌన్లో డ్ చేసుకుంటున్నారు.
ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ సీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈమధ్యనే రిలీజ్ అయింది. ఇది కూడా సక్సస్ సాధించింది. ఒకవేళ మొదటి పార్టుతో పాటు సీక్వెల్ ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఏదీ ఏమైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను తెలుగులో చూసే అవకాశం వస్తుండడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.