Congress : నేతల రాకతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. మునుపు ఎన్నడూ లేనంత ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతల ఓవర్ లోడ్ తో ఫుల్లుగా నిండిపోయింది. ‘గ్యారెంటీ’ స్కీంతో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల బీజేపీని కాదని కాంగ్రెస్ లో పొంగులేటి, జూపల్లి చేరడానికి ప్రధాన కారణం ఈ ‘గ్యారెంటీ’ స్కీంనే. పొంగులేటి , జూపల్లి సహా వారి కోరికలు తీర్చి వారికి అవసరమైన ఎమ్మెల్యే సీట్ల హామీ సహా అన్నీ ఇస్తామని చెప్పడంతోనే వాళ్లు కాంగ్రెస్ లో చేరిపోయారు.
బీఆర్ఎస్, బీజేపీని దెబ్బకొట్టడానికే కాంగ్రెస్ ఈ గ్యారెంటీ స్కీంను అమలు చేసింది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో నేతలకు ఎమ్మెల్యే టికెట్లు, భవిష్యత్ పై భరోసారి ఇస్తూ గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది.
కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.అందుకే ఈ పథకాలతోపాటు నేతలకు పక్కా సీట్ల గ్యారెంటీ ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పై అందరిలో భరోసా కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీని ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.