Modi vs Namasthe Telangana and Telangana Today: పార్లమెంట్ లో ప్రధాని మోడీ ఏపీ -తెలంగాణ విభజనపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ విభజనను అవమానించేలా మోడీ మాట్లాడారని ఈ రాష్ట్ర మీడియా దుమ్మెత్తిపోసింది. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ అనుకూల మీడియా దీనిపై మోడీని, బీజేపీని కడిగేసింది. ఈ క్రమంలోనే లోక్ సభలో మోడీ వ్యాఖ్యలను వక్రీకరించారన్న కారణంతో తెలంగాణలోని రెండు పత్రికలకు బీజేపీ లోక్ సభ ద్వారా నోటీసులు జారీ చేయించింది.
అధికార టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉంటున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్ సభ నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. లోక్ సభకు చెందిన సభా హక్కులు, నైతిక విలువల విభాగం మంగళవారం ఈ రెండు పత్రికలకు నోటీసులు జారీ చేసింది.
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు మేరకే ఈ నోటీసులు జారీ అయ్యాయి. లోక్ సభ వ్యవహారాలపై తప్పుడు కథనాలు రాయడం ద్వారా సభా హక్కుల ఉల్లంఘనకు, సభ ధిక్కారానికి ఈ పత్రికలు పాల్పడ్డాయని ఎంపీ అరవింద్ ఫిర్యాదు ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయి. మోడీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని.. తప్పుగా ప్రచురించాయని ఆరోపిస్తూ రెండు పత్రికలకు నోటీసులు జారీ చేశారు. ఈనోటీసులకు 72 గంటల్లో సమాధానం ఇవ్వాలని రెండు పత్రికల సంపాదకులను ఆదేశించింది.
అయితే మోడీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? హక్కులను ఉల్లంఘించింది కేవలం ఈ రెండు పత్రికలేనా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రధాని వ్యాఖ్యలు అభ్యంతరం కరం కాదా? అన్నది ఇక్కడ తేలాల్సి ఉంది. పత్రికలకు ఇచ్చిన నోటీసులు సమాజం అల్లకల్లోలం అయితే చర్యలు తీసుకోవడానికి ఇచ్చేవి. కానీ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కథనాలు రాస్తే సమాజం అల్లకల్లోలం అవుతుందా? ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆయుధాలు వచ్చి తిరుగుతారా? అంటే అదేం జరగలేదనే చెప్పాలి. మరి అలాంటి సందర్బాల్లో జారీ చేసే నోటీసులను టీఆర్ఎస్ పత్రికలకు ఇప్పుడు జారీ చేయడం చూసి విశ్లేషకులే విస్తుపోతున్నారు.
భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి, మీడియాకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. మనం అభిప్రాయాలు మనం చెప్పుకునే అవకాశం ఇచ్చింది. తప్పును తప్పు అని చెప్పడం ఉల్లంఘన అస్సలే కాదు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పు పట్టడం నేరం కాదు. పత్రికలు రాస్తే పార్లమెంట్ హక్కుల ఉల్లంఘన.. కోర్టు ధిక్కరణ ఎలా అవుతుందో నోటీసులు జారీ చేసిన వారికే తెలియాలి..
Also Read: హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ తరలిపోకుండా తెలంగాణ సర్కార్ ‘భీమ్లానాయక్’ ను వాడుకుందా?
పార్లమెంట్ లో ఉండే వారు కనీస సృహ పరిజ్ఞానం లేకుండా తెలంగాణకు చెందిన రెండు పత్రికలకు నోటీసులు జారీ చేశారు. పౌర హక్కుల గురించి అవగాహన లేకుండానే ఈ నోటీసులు ఇచ్చి అభాసుపాలయ్యారు. పౌరుల హక్కులకు లేని రక్షణ.. ప్రజాప్రతినిధులకు ఉంటుందా? అన్నది ప్రశ్న. ప్రజాప్రతినిధులకు ప్రివిలేజ్ ఉంటే పౌరులకు, ప్రజలకు ఉంటుంది. ఈ హక్కు మీడియా స్వేచ్ఛకు కూడా వర్తిస్తుంది.
పత్రికల కథనాల ద్వారా ప్రజలు మోడీ పట్ల వ్యతిరేకత తెచ్చుకుంటారా? మోడీ ప్రసంగం విని తెలంగాణ ప్రజలు ఆయనపై యుద్ధానికి ఏం దిగలేదు కదా.. అయినా మోడీ చేసిన ప్రసంగం రెండు రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు పెట్టేలా ఉంది. సామరస్యంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల పాత గాయాలను మళ్లీ లేపేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. మోడీ చేసిన వ్యాఖ్యలు తప్పు. వాటిని టీఆర్ఎస్ పత్రికలు మరో యాంగిల్ లో చూపడం కూడా తప్పే. కేవలం పత్రికలను ఈ విషయంలో బాధ్యులను చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: రష్యా, ఉక్రెయిన్.. ఎవరి సత్తా ఎంత? సైన్యం బలాబలాలివీ!
Recommended Video: