Heroine Ravali: హీరోయిన్ రవళి అంటే ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ 1990వ దశకంలో ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా రాణించింది. గుడివాడలో పుట్టిన రవళి.. అప్పటి దిగ్గజ డైరెక్టర్ అయిన ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఆలీబాబా అరడజను దొంగలు మూవీతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. అయితే ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం పెళ్లి సందడి.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో శ్రీకాంత్ సరసన ఆడిపాడింది రవళి. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఇందులోని సాంగ్ “మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే అనే పాట అయితే ఇప్పటికీ ఫేమస్. దీని తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఆమె పేరు రవళి అయినా కూడా సినీ ఇండస్ట్రీకి మాత్రం శైలజగా పరిచయమైంది. కానీ మళ్లీ రవళిగా పేరు మార్చుకుంది.
Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?
మధ్యలో అదృష్టం కలిసి రావాలని అప్సర అని కూడా మార్చుకుంది. టాలీవుడ్ లో ఆమె నటించిన శుభాకాంక్షలు, పెళ్ళి సందడి, వినోదం, ఒరేయ్ రిక్షా లాంటి మూవీలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అయితే ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకు సెకండ్ హీరోయిన్ గానే చేసింది. అయితే ఆమె కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లో కూడా బాగానే నటించింది. నిజం చెప్పాలంటే తెలుగులో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాల్లో చేసింది.
కన్నడ భాషలో శివరాజ్ కుమార్ సరసన అలాగే సుమన్, జగ్గేశ్ లాంటి స్టార్ హీరోల మూవీల్లో చేసింది. ఇక తమిళంలో కూడా అర్జున్, విజయకాంత్, సత్యారాజ్ లాంటి సీనియర్ హీరోల మూవీల్లో మెరిసింది. అయితే రాను రాను ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఆమె టీవీ షోలలో కూడా మెరిసింది. కానీ ఆ షోలు కూడా ఎక్కువ రోజులు చేయకుండా మానేసింది.
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్, బిజినెస్ మ్యాన్ అయిన నీలకృష్ణతో 2007 మే 9న పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకుంది. అయితే ఏడాదికే అంటే 2008లోనే వీరికి ఒక పాప జన్మించింది. ఇక 2009లో ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. టీడీపీలో చేరి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసింది. అయితే ఆమె చెల్లెలు హరిత టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం రవళి తల్లితండ్రులు అయిన ధర్మారావు, విజయదుర్గలతో కలిసి చెన్నైలో ఉంటోంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి ఒకప్పటి తన అభిమానుల కోసం ఆమె మళ్లీ వెండితరకు ఎంట్రీ ఇస్తుందో లేదో అన్నది వేచి చూడాలి.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?