Lok Sabha Elections & AP Assembly Elections Results 2024 Live Updates : ఉత్కంఠకు తెరపడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవితవ్యం తేలనుంది. ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి వెళ్లే అభ్యర్థులు ఎవరో తేలనుంది. మంగళవారం ఎనిమిది గంటలకు ఏపీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలో చూస్తే తొలుత కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రెండు చోట్ల 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. కౌంటింగ్ ప్రారంభించిన ఐదు గంటల్లోగా పూర్తి ఫలితాలు రానున్నాయి. అయితే రాష్ట్రంలో భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆలస్యం కానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో వాట్ల లెక్కింపు 26 రౌండ్లలో ఉంటుంది. కనీసం 10 గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎవరిది అధికారం దక్కనుందన్నది ఉత్కంఠగా మారింది. బీజేపీ ఫుల్ కాన్ఫిడెంట్స్ తో ఉంది. మోడీ అధికారంలోకి రానున్నారని అంచనాలున్నాయి. కాంగ్రెస్ మరోసారి ఓటమి తప్పదని నిరాశగా ఉంది. ఇక ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా ఉన్నాయి.. ఈరోజు సాయంత్రానికి కొంచెం క్లారిటీ రానుంది.
లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. శాసనసభ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఒకే కౌంటింగ్ హాల్లో హాల్లో జరుగుతోంది.ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ వాటర్ లెక్కింపునకు ఒక్కో రౌండ్ కు గరిష్టంగా రెండున్నర గంటల సమయం, ఈవీఎంల ఓట్లకు ఒక్కో రౌండ్ కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్లో ఒక్కో టేబుల్ పై 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.
మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం. 91,500 ఓట్ల మెజార్టీతో లోకేష్ గెలుపు.
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల , కుమారుడు అకీరా నందన్, సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విచ్చేశారు.
విజయనగరం పార్లమెంట్ స్థానంలో లీడ్ లో దూసుకుపోతున్న టీడీపీ
1.శృంగవరపుకోట - గెలుపు
కోళ్ల లలిత కుమారి (టీడీపీ)
2.నెల్లిమర్ల - గెలుపు
లోకం నాగ మాధవి ( జనసేన )
3.విజయనగరం - గెలుపు
పూసపాటి అదితి గజపతి రాజు ( టీడీపీ)
4.చీపురుపల్లి - గెలుపు
కిమిడి కళా వెంకట రావు (టీడీపీ)
5.గజపతినగరం - గెలుపు
కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)
6.బొబ్బిలి - గెలుపు
బేబీ నాయన (టీడీపీ)
7.పార్వతీపురం - గెలుపు
బోనెల విజయచంద్ర (టీడీపీ)
8.సాలూరు - గెలుపు
గుమ్మడి సంధ్యారాణి (టీడీపీ)
9.కురుపాం - గెలుపు
తొయక జగదీశ్వరీ (టీడీపీ)
మొదటి సారి పోటీ చేసి గెలుపొందిన నలుగురు వ్యక్తులు (గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం)
శృంగవరపుకోట, చీపురుపల్లి మినహా మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న మిగిలిన ఏడుగురు అభ్యర్థులు
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. 17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపో యింది. తొలుత మెదక్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఆ తరువాత సీన్ మారిపో యింది. అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది..
●సాలూరు టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి విజయం
●కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరీ విజయం
●తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ 21,250 ఓట్ల అధిక్యంతో విజయం
●పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 21 వేల మెజారిటీతో గెలుపు
●విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 48,871 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
●సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 27,196 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
●జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య 15,930 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
●మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ 42,268 ఓట్ల మెజారిటీతో విజయం
●సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ 29,674 ఓట్ల ఆధిక్యంతో విజయం
●పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప గెలుపు
●వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు గెలుపు
●గంగాధరనెల్లూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి థామస్ విజయం
●శ్రీకాకుళం అసెంబ్లీలోటీడీపీ అభ్యర్థి గొండు శంకర్ విజయం
●ఆమదాలవలస అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ విజయం
●తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం
చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వీర తిలకం దిద్దిన భార్య అన్నా లేజ్నేవా.
కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి....తాతకు, బంధువులకు కేక్ తినిపించారు.
* భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు
*చంద్రబాబు ని కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను
విజయవాడ వెస్ట్ లో భారీ ఆధిక్యంతో విజయఢంకా మోగిస్తున్న సుజనా చౌదరి..
15 రౌండ్లకు 45,524 ఓట్ల మెజార్టీ సాధించిన సుజనా.. కొనసాగుతున్న మరో 4 రౌండ్ల కౌంటింగ్..
1) తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి,
2) చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి,
3) బందర్లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి,
4) జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Lok sabha elections ap assembly elections results 2024 live updates in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com