Lok Sabha Election Results 2024: లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతోంది.. 543 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఉదయం 10: 08 నిమిషాల వరకు ఓట్లను లెక్కించగా.. బిజెపి కూటమి 296, కాంగ్రెస్ కూటమి 192, ఇతరులు 53 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నారు. బిజెపి ఒక స్థానంలో విజయం సాధించారు.
తెలంగాణ లోక్ సభకు సంబంధించి కాంగ్రెస్ ఎనిమిది, బిజెపి 7, బీఆర్ఎస్ ఒకటి, మజిలీస్ ఒక స్థానంలో లీడ్ లో కొనసాగుతున్నాయి.
నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలలో బిజెపి అభ్యర్థులు భరత్ ప్రసాద్, డీకే అరుణ లీడ్ లో ఉన్నారు.
పెద్దపల్లి, జహీరాబాద్, భువనగిరి, వరంగల్ పార్లమెంటు స్థానాలలో గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక ఏపీ అసెంబ్లీలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.. మేజిక్ ఫిగర్ ను కూటమి అభ్యర్థులు దాటారు. ఇప్పటివరకు టిడిపి అభ్యర్థులు 108 స్థానాలు, జనసేన 14, బిజెపి మూడు స్థానాలలో ముందంజలో ఉంది. వైసిపి 15 స్థానాలలో లీడ్ లో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరో మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగతా వారంతా ఓటమి బాటలో కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే టిడిపి 15, వైసీపీ 4, జనసేన 2, బిజెపి 4 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నాయి.
ఇక జాతీయస్థాయి ఎన్నికల విషయానికొస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసిన వారణాసిలో హోరహోరిగా పోరు కొనసాగుతోంది. పావుగంట క్రితం వరకు వెలువడిన ఓట్ల లెక్కింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనుకంజలో ఉండగా.. ఇప్పుడు లీడ్ లో కి వచ్చారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 619 ఓట్ల తేడాతో లీడ్ లో కొనసాగుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్ స్థానంలో బిజెపి అభ్యర్థి గోవిల్ పై సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సునీత వర్మ 6,388 ఓట్ల తేడాతో లీడ్ లో కొనసాగుతున్నారు. టివి రాముడిగా సుపరిచితుడైన అరుణ్ గోవిల్ సుపరిచితుడు.