https://oktelugu.com/

Lok Sabha Election Results 2024 : వామ్మో.. ఇదేం మెజారిటీ? దేశంలోనే అత్యధికం.. ఏకంగా 11 లక్షలా? ఎవరికంటే?

Lok Sabha Election Results 2024 వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1.52 లక్షల ఓట్ల తేడాతో గెలుపును అందుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2024 10:22 pm
    Shankar Lalwani

    Shankar Lalwani

    Follow us on

    Lok Sabha Election Results 2024 : సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అంచనా వేసిన 400 సీట్లు రాకపోవచ్చు గాక.. ఆ పార్టీ 300 సీట్లకు కొంచెం దూరంలో ఉండిపోవచ్చు గాక.. ఆ బాధను ఈ అభ్యర్థి కొంతలో కొంత తీర్చాడు. కాంగ్రెస్ వల్ల కానిది, ఇతర పార్టీలు చేయలేనిది చేసిపడేశాడు.. చివరికి మోడీ కూడా సాధించలేని రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

    మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో బిజెపి అభ్యర్థిగా గెలిచిన శంకర్ లాల్వాని తన సమీప ప్రత్యర్థి పై ఏకంగా 11.72 లక్షల ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించాడు. సరికొత్త చరిత్రను తిరగ రాశాడు. ఆయనకు ఏకంగా 12,26, 751 ఓట్లు పోల్ అయ్యాయి. రెండవ స్థానంలో నోటాకు 2,18,674 కు నమోదయ్యాయి. ఆయన సమీప ప్రత్యర్థికి కేవలం 51,000 ఓట్లు మాత్రమే పోల్ కావడం విశేషం.

    గతంలో ఈ రికార్డు బిజెపి నేత ప్రీతం ముండే పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును లాల్వాని బ్రేక్ చేశాడు. బీడ్ పార్లమెంటు స్థానానికి 2014లో ఉప ఎన్నికలు జరగగా.. 6.96 లక్షల ఓట్ల తేడాతో ప్రీతం ముండే విజయం సాధించారు. ఇక ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, గుజరాత్ బిజెపి నాయకుడు సి ఆర్ పాటిల్ ఏకంగా ఏడు లక్షల మెజారిటీతో విజయాలు సాధించిన నాయకుడిగా రికార్డ్ సృష్టించారు..

    అస్సాం రాష్ట్రంలోని దుబ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రకిబుల్ హుస్సేన్ 9.2 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విధిష నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 8.2 లక్షల ఓట్ల పైచిలుకు తేడాతో విజయం సాధించారు.

    గత ఎన్నికల్లో గుజరాత్ లోని నవసరి నియోజకవర్గంలో బిజెపి సీనియర్ నాయకుడు సిఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆయన 7.73 లక్షలకు పైగా ఓట్లు తేడాతో విజయాన్ని అందుకున్నారు.

    గాంధీనగర్ స్థానం నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 7.4 లక్షల ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు. అమిత్ షాకు 10.10 లక్షల ఓట్లు వచ్చాయి.

    గుజరాత్ రాష్ట్రంలోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభిషేక్ బెనర్జీ ఏకంగా 7.7 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.. ఆయనకు దాదాపుగా 10.50 లక్షల ఓట్లు పోల్ కావడం విశేషం.

    వడోదర పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థి హేమంగు జోషి 5.82 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.

    నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5.5 లక్షల ఓట్ల పైచిలుకు తేడాతో సమీప బిజెపి అభ్యర్థిపై విజయం సాధించారు. రఘువీర్ రెడ్డికి 7.84 లక్షల పైచిలుకు ఓట్లు రావడం విశేషం.

    ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి  4.67 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈయనకు 7.66 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయి.

    మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 3.87 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.

    రాయి బరేలి ప్రాంతం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్ గాంధీ 3.88 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. వయనాడు నియోజకవర్గం నుంచి కూడా ఆయన 3.64 లక్షల ఓట్ల తేడాతో గెలుపును అందుకున్నారు.

    వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1.52 లక్షల ఓట్ల తేడాతో గెలుపును అందుకున్నారు.