Lok Sabha Election Results 2024: తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి.. యూపీ, ఎంపీ ఎన్డీఏ..

బిహార్‌లో కూడా ఎన్డీఏ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 40 స్థానాలకు 36 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 4, 2024 10:58 am

Lok Sabha Election Results 2024

Follow us on

Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి భారీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈసారి తమిళనాడులో ఖాతా తెరుస్తామని బీజేపీ ధీమా కనబర్చింది. కానీ, కౌంటింగ్‌లో పోటీ ఇచ్చినట్లు కనిపించినా.. సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక కేరళలో కూడా ఇండియా కూటమి అభ్యర్థులే ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక్కడ కూడా బీజేపీ వెనుకబడింది. దక్షిణాధిలోని ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు చిక్కడం లేదు.

యూపీ, ఎంపీ,
ఇక ఉత్తరభారత దేశంలో మాత్రం బీజేపీ, ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. 2019తో పోలిస్తే.. ఇండియా కూటమి పుంజుకుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ దిశగా కొనసాగుతుంది. మణిపూర్‌లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది.

బిహార్‌లో ఎన్డీఏ లీడ్‌..
ఇక బిహార్‌లో కూడా ఎన్డీఏ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 40 స్థానాలకు 36 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు.

మహారాష్ట్రలో ఎన్డీయే జోరు..
ఇక మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 25 లోక్‌సభ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది.

ఏపీలో కూటమి జోరు..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవబోతోంది. నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కూటమి 20 స్థానాల్లో లీడల్‌లో ఉంది.

కర్ణాటకలో బీజేపీ దూకుడు..
ఇక కర్ణాటకలో కూడా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యం..
ఇక ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ పట్టు కొనసాగిస్తోంది. ఇక్కడ 25 స్థానాలకు 24 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.

తెలంగాణలో నువ్వా నేనా..
ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగుతోంది. కాంగ్రెస్‌ 8, బీజేపీ 9 8 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. ఎంఐఎం సిట్టింగ్‌ స్థానం హైదరాబాద్‌లో వెనుకబడింది.

ఒడిశాలో బీజేపీ లీడ్‌..
ఇక ఓడిశాలో బీజేపీ పట్టు సాధిస్తోంది. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.

రాజస్థాన్‌లో హోరాహోరీ..
ఇక రాజస్థానలో ఇండియా, ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది.

పంజాబ్‌లో కాంగ్రెస్‌ లీడ్‌..
ఇక పంజాబ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

ఢిల్లీలో బీజేపీ పాగా..
ఇక ఢిల్లీలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఏడు లోక్‌సభ స్థానాలకు 6 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పట్టు..
ఇక పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్టు నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ టీఎంసీ అభ్యర్థులు 27 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.