https://oktelugu.com/

రోడ్ల పనులపై కేటిఆర్ అభినందన ట్వీట్!

సాధారణ రోజుల్లో నగరంలో రోడ్ల పనుల కోసం చాలా తక్కువ సమయం కేటాయించే వారు కానీ లాక్‌ డౌన్‌ టైంను సద్వినియోగం చేసుకుని రోడ్ల పనులు పూర్తి చేసినందుకు అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రద్దీ లేని రహదారులపై వేగంగా పనులు చేపట్టి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దారు. ఇప్పుడు నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. సాధారణంగా నగరంలో రోడ్ల పనులకు రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే కేటాయించేవారు. కానీ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 25, 2020 / 01:02 PM IST
    Follow us on

    సాధారణ రోజుల్లో నగరంలో రోడ్ల పనుల కోసం చాలా తక్కువ సమయం కేటాయించే వారు కానీ లాక్‌ డౌన్‌ టైంను సద్వినియోగం చేసుకుని రోడ్ల పనులు పూర్తి చేసినందుకు అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రద్దీ లేని రహదారులపై వేగంగా పనులు చేపట్టి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దారు. ఇప్పుడు నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. సాధారణంగా నగరంలో రోడ్ల పనులకు రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే కేటాయించేవారు. కానీ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 14 నుంచి 18 గంటల పాటు అధికారులు, కూలీలు శ్రమించారు. కేవలం 40 రోజుల్లోనే బీటీ, వీడీసీసీ, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడానికి కృషి చేసినమేయర్‌ బొంతు రామ్మోహన్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తో పాటు ఇంజినీరింగ్‌ అధికారులను కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.