లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు చేస్తున్నాం: ఈటల

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్డౌన్ అమలు చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా చేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కేంద్రం సూచించిన విధంగానే తెలంగాణలో టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ టెస్టులు చేపట్టొద్దని ఐసీఎంఆర్ చెప్పిందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా పాజిటిల్ లక్షణాలు ఉన్నావారికే టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిదని ఆయన చెప్పారు. […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 7:22 pm
Follow us on


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్డౌన్ అమలు చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా చేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కేంద్రం సూచించిన విధంగానే తెలంగాణలో టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ టెస్టులు చేపట్టొద్దని ఐసీఎంఆర్ చెప్పిందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా పాజిటిల్ లక్షణాలు ఉన్నావారికే టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిదని ఆయన చెప్పారు.

మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

సీఎం కేసీఆర్ కరోనా విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు అన్నివిధలా సహకారం అందిస్తున్నారని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరని ఇప్పటికే అప్రమత్తం చేశారని మంత్రి స్పష్టం చేశారు. కాగా శుక్రవారం తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించారు. వీటిని కూడా కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,044కు చేరిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 24మంది బాధితులు ఇవాళ డిశ్చార్జి చేసినట్లు ఆయన తెలిపారు.