https://oktelugu.com/

లాక్ డౌన్ ఎఫెక్ట్… వాట్సాప్‌ ప్రియులకు షాక్!

కరోన భయంతో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో… ఇంట్లో ఖాళీగా ఉంటున్న నెటిజన్లు వాట్సాప్‌ స్టేటస్‌ లలో విపరీతంగా వీడియోలు అప్‌ లోడ్‌ చేస్తున్నారు. దీంతో సర్వర్లపై భారం పడి, వర్క్‌ ఫ్రం హో చేసేవారికి, అన్ లైన్ బిసినెస్ చేసే వారికి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. అందువల్ల వాట్సాప్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ […]

Written By: , Updated On : March 30, 2020 / 04:37 PM IST
Follow us on

కరోన భయంతో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో… ఇంట్లో ఖాళీగా ఉంటున్న నెటిజన్లు వాట్సాప్‌ స్టేటస్‌ లలో విపరీతంగా వీడియోలు అప్‌ లోడ్‌ చేస్తున్నారు. దీంతో సర్వర్లపై భారం పడి, వర్క్‌ ఫ్రం హో చేసేవారికి, అన్ లైన్ బిసినెస్ చేసే వారికి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. అందువల్ల వాట్సాప్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేయలేరు. 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. ఈ విషయాన్ని వాబీటాఇన్‌ఫో వెల్లడించింది. ఇది భారతీయులకు మాత్రమే కావడం విశేషం.

లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన వారు నెట్‌ ని అధికంగా వినియోగించడం వల్ల వేగం కూడా తగ్గుతుందని.. ఇతర ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడానికి ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉండడం కూడా మరో కారణమని తెలుస్తోంది. ఇప్పటికే నెట్‌ వినియోగం పెరగడంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సైట్లు, యాప్‌లు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వీడియో, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వీడియో స్ట్రీమింగ్‌ క్వాలిటీని తగ్గించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ స్టేటస్ లో పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. వినియోగదారుల నెట్‌వర్క్‌ లో ఉన్న వ్యక్తులకు వీటిని వీక్షించే అవకాశం వుంది. అలాగే ఈ స్టేటస్ లో షేర్ చేసిన ఇమేజ్ లు, జిఫ్స్, లేదా వీడియోలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యమవుతాయి. వాట్సాప్ స్టేటస్ ను ప్రారంభించినపుడు 90 సెకన్ల నుండి మూడు నిమిషాల వీడియోలను అనుమతించింది. ఆ తరువాత, దీన్ని 30 సెకన్లకు తగ్గించింది. భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు.