మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు!

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ 5.0 ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌ డౌన్‌ ను కేంద్రం పొడిగించింది.  కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌ డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.  తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌ డౌన్‌5.0  మార్గదర్శకాలను  కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.  […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 7:45 pm
Follow us on

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ 5.0 ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌ డౌన్‌ ను కేంద్రం పొడిగించింది.  కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌ డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.  తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌ డౌన్‌5.0  మార్గదర్శకాలను  కూడా కేంద్రం విడుదల చేసింది.

రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.  జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.  ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి