ప్రజలు కావాలా? వారి ప్రాణాలు కావాలా? లేక దేశ ఆర్థిక వ్యవస్థ కావాలా? ఈ మీమాసంలో ఆర్తిక వ్యవస్థ వైపే మొగ్గుచూపిన మోడీ సర్కార్ లాక్ డౌన్ విధించకూడదని ఈ సెకండ్ వేవ్ సమయంలో నిర్ణయించింది. అయితే ప్రాణాలు పోతున్నాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రజల కోసం లాక్ డౌన్ విధించాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి, వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దేశంలో లాక్ డౌన్ విధించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించడం సంచలనమైంది. ప్రజలను ఎలా పాలించాలి,? పాలన వ్యవస్థపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశించడం చూస్తే దేశ పాలన రంగం ఎంత దీనస్థితికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి ప్రజా ప్రభుత్వాలు సక్రమంగా పనిచేసినప్పుడు.. న్యాయం చేసినప్పుడు కోర్టుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ విధించాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.
లాక్ డౌన్ కారణంగా సామాజిక, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిపై తమకు అవగాహన ఉందని.. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసు అని.. అందుకే ఆయా వర్గాల వారి అవసరాలను తీర్చేలా ముందస్తు చర్యలను తీసుకోవాలని సుప్రీం తెలిపింది.
కానీ ప్రభుత్వాలు ఆ పనిచేయడం లేదు కనుకే ఇప్పుడు ఈ దీనస్థితి నెలకొంది. కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.