కేంద్రం సడలింపు.. రాష్ర్రం బిగింపు!

దేశంలో కరోనా భయంతో అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. మొదటి దశగా 21 రోజుల లాక్ డౌన్ ను అమలుపరచగా.. రెండో దశలో మరో 19 రోజులు పొడిగించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు(ఏప్రిల్ 20) నుండి కరోనావైరస్‌ వ్యాప్తి ఉదృతం(హాట్‌ స్పాట్‌)గా లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 11:30 am
Follow us on

దేశంలో కరోనా భయంతో అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. మొదటి దశగా 21 రోజుల లాక్ డౌన్ ను అమలుపరచగా.. రెండో దశలో మరో 19 రోజులు పొడిగించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు(ఏప్రిల్ 20) నుండి కరోనావైరస్‌ వ్యాప్తి ఉదృతం(హాట్‌ స్పాట్‌)గా లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు (మే 7 వరకు) పొడిగిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:మోడీ నిర్ణయాలకు కేసీఆర్ గుడ్ బై?

తెలంగాణలో ఏప్రిల్‌ 20 తర్వాత ఎలాంటి సడలింపులు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. వచ్చే నెల ఏడో తేదీ వరకు లాక్‌ డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే యథాతథంగా ఉంటాయన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మే 5న మరోసారి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కిరాణా దుకాణాలు, కూరగాయల షాపులు తెరిచి ఉంటాయన్నారు. బియ్యం, నూనె మిల్లులు కొనసాగుతాయని, శానిటైజర్ల తయారీ, ఫార్మా కంపెనీలు పనిచేస్తాయన్నారు. కరోనాకు మందులు, టీకాలు, నియంత్రించే ఔషధాలు లేవు, కాబట్టి ఉపశమన చర్యలు తప్పవని అందుకే కేంద్రం సడలింపు ఇచ్చినా తెలంగాణాలో మాత్రం ఆంక్షలు యథావిథిగా కొనసాగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.