తీరని కరోనా దాహం…ఆగని మారణహోమం!

ప్రపంచవ్యాప్తంగా గంట గంటకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి కోవిద్19 మృతుల సంఖ్య ఆగడం లేదు. ఇప్పటికే 193 దేశాలలో కరోనా విజృంభిస్తోంది.ఏ దేశంలో చూసిన కరోనా మారణహోమం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాధితో దాదాపు 24 లక్షల మంది పోరాడుతున్నారు. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,65,00 చేరింది. అమెరికాలో ఏడున్నర లక్షల మందిని వేధిస్తున్న వైరస్. 40వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 11:26 am
Follow us on

ప్రపంచవ్యాప్తంగా గంట గంటకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి కోవిద్19 మృతుల సంఖ్య ఆగడం లేదు. ఇప్పటికే 193 దేశాలలో కరోనా విజృంభిస్తోంది.ఏ దేశంలో చూసిన కరోనా మారణహోమం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాధితో దాదాపు 24 లక్షల మంది పోరాడుతున్నారు. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,65,00 చేరింది.

అమెరికాలో ఏడున్నర లక్షల మందిని వేధిస్తున్న వైరస్. 40వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ దేశం 38 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. భారతదేశంలో కూడా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు 3,83,985 మంది నుంచి తీసుకున్న 4,01,586 రక్త నమూనాలను పరీక్షించామని, 17,615 మందికి పాజిటివ్ అని , 500 పైగా ప్రజలు కోవిడ్ వ్యాధితో చనిపోయారని వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. తెలంగాణలో 809, ఏపీలో 603 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి 34 మంది చనిపోయారు.

అంతేకాకుండా కరోనా వైరస్‌ 193 దేశాల్లో మృత్యు ఘంటికలను అధికం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 23,86,329 మంది ఈ మహమ్మారి బారినపడగా.. ఆదివారం నాటికి 1,63,928 మంది చనిపోయారు. అమెరికాలో బాధితులు 7,54,563 మంది కాగా.. మరణాల సంఖ్య 39,863కి చేరింది. ఇటలీలో 24 గంటల్లో 433 మరణాలు సంభవించాయి. వారం రోజుల్లో ఇన్ని తక్కువ మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. స్పెయిన్‌లో మార్చి 22 నుంచి చూస్తే.. అతి తక్కువగా 410 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో ఆదివారం   395 మరణాలు సంభవించాయి. బ్రిటన్‌లో 1,14,217 మందికి వైరస్‌ సోకగా.. 15,464 మంది ప్రాణాలు విడిచారు. హాంకాంగ్‌, మకావుతో కలిపి తమ దేశంలో 2,735 కేసులు నమోదైతే 4,632 మంది మృతి చెందినట్టు చైనా వెల్లడించింది. బెల్జియంలో  5,453 మంది మరణిస్తే.. వారిలో 2,772 మంది రిటైర్మెంట్‌ హోముల్లో ఉంటున్నవారే. రష్యాలో 24 గంటల్లో 48 మంది చనిపోయారు. ఆదివారం రికార్డు స్థాయిలో 6,060 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో 24 గంటల్లో 514 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో సంఖ్య 7,993కి చేరింది. 159 మంది మరణించారు.