ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం – జగన్ సర్కార్ మధ్య మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ కమిషనర్.. కరోనా నేపథ్యంలో సాధ్యం కాదంటూ ప్రభుత్వం.. లేఖల వార్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. ఏపీ సీఎస్ కు లేఖ రాశారు.
Also Read: అక్కడ టీడీపీకి నేతలు కావలెను..!
ప్రభుత్వం సహకరించాలి..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ సీఎస్ నీలం సాహ్నికి శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని.. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహరించాలని కోరారు. దేశంలో పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. సీఎస్ తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కి కూడా నిమ్మగడ్డ లేఖ రాశారు. అందులో కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన ఎన్నికల కమిషనర్.. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. మరి, ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్