https://oktelugu.com/

గ్రేటర్లో ఆపరేషన్ ఆకర్ష్.. ఏ పార్టీకి కలిసొచ్చేనో?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. నగరవాసులు టీఆర్ఎస్.. బీజేపీ.. ఎంఐఎంలను సమానంగా ఆదరించడంతో ఆయా పార్టీలకు అటూ ఇటూగా ఒకే రకమైన సీట్లు వచ్చాయి. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. Also Read: హస్తినలో కేసీఆర్ పోరాటం చేస్తారా? సడన్ టూర్ వెనుక మర్మమెంటీ? టీఆర్ఎస్ 56సీట్లతో గ్రేటర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గ్రేటర్లో టీఆర్ఎస్ అత్యధికంగా ఎక్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 11, 2020 / 03:44 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. నగరవాసులు టీఆర్ఎస్.. బీజేపీ.. ఎంఐఎంలను సమానంగా ఆదరించడంతో ఆయా పార్టీలకు అటూ ఇటూగా ఒకే రకమైన సీట్లు వచ్చాయి. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

    Also Read: హస్తినలో కేసీఆర్ పోరాటం చేస్తారా? సడన్ టూర్ వెనుక మర్మమెంటీ?

    టీఆర్ఎస్ 56సీట్లతో గ్రేటర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గ్రేటర్లో టీఆర్ఎస్ అత్యధికంగా ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉన్నప్పటకీ మేయర్ పీఠానికి అందనంత దూరంగా ఉంది. ఇక బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ లేదా టీఆర్ఎస్ మరో పార్టీతో కలిస్తే తప్ప మేయర్ పీఠం ఎవరికీ దక్కని పరిస్థితి నెలకొంది.

    ప్రస్తుతానికి గ్రేటర్లో అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదు. ఇక బీజేపీ సైతం టీఆర్ఎస్ పోరుకే సిద్ధమవుతుండటంతో గ్రేటర్లో స్పెషల్ పాలన విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    నిప్పులేనిది పొగరాదన్న చందంగా గ్రేటర్లో టీఆర్ఎస్.. బీజేపీలు సైలంట్ గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన కొందరు అనుచరులు బీజేపీలో చేరి గెలిచినట్లు తెలుస్తోంది. దీంతో వారిని తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకునేలా పావులు కదుతుపుతున్నారు. ఇక బీజేపీ సైతం టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎర వేస్తుందని టాక్ విన్పిస్తోంది.

    Also Read: పవన్.. నీకిది తగునా?

    బీజేపీ.. టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తమ పార్టీలో చేరే కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు రెట్టింపు డబ్బులు ఇవ్వడంతోపాటు కోట్లల్లో పనులు అప్పగిస్తామని చెబుతున్నాయట. అయితే నిన్నటి వరకు టీఆర్ఎస్ లో కొనసాగి బీజేపీలో గెలిచిన కార్పొరేటర్లు తమ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్లాన్స్ బెడిసి కొడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టువదలకుండా బీజేపీలోని కొంతమంది లాగేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్ష్ ను చేపడుతోంది.

    దీంతో ఎవరీ ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే ఆసక్తిని నగరవాసుల్లో నెలకొంది. ప్రస్తుత పాలకవర్గం గడువు మరో రెండు నెలలు ఉండటంతో అప్పటివరకు ఎవరైతే కార్పొరేటర్లను తమవైపు తిప్పుకుంటారో వారికే మేయర్ పీఠం దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్