Homeజాతీయ వార్తలుCentral govt rules for live in couples: కేంద్రం సంచలనం.. సహజీవనం చేసే వాళ్లు...

Central govt rules for live in couples: కేంద్రం సంచలనం.. సహజీవనం చేసే వాళ్లు ఇక చెప్పాల్సిందే

Central govt rules for live in couples: నేటికాలంలో పెళ్లిళ్లు చేసుకునే ఆసక్తి యువతలో ఉండటంలేదు. అనేక కారణాలను సాకుగా చూపి సహజీవనానికి ఇష్టపడుతున్నారు. ఉన్నన్ని రోజులు హాయిగా ఉంటున్నారు. భేదాభిప్రాయాలు వ్యక్తమైతే టాటా చేప్పేసుకుంటున్నారు. సహజీవనం లో ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. బంధాలకు లొంగాల్సిన అవసరం లేదు. పద్ధతులను పాటించాల్సిన అవసరం లేదు. ఒకరికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు.

ఇన్ని సౌలభ్యాలు ఉన్ని కాబట్టి చాలామంది సహజీవనానికి ఓటేస్తున్నారు. నచ్చినంత కాలం మెచ్చిన వాళ్లతో ఉంటున్నారు. ఆతర్వాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇలా యువత సహజీవనానికి అలవాటు పడ్డారు కాబట్టి డేటింగ్ యాప్స్ కూడా విపరీతంగా వచ్చేశాయి. డేటింగ్ యాప్స్ లో రకరకాల సౌలభ్యాలు అందుబాటులోకి రావడంతో యువత రెచ్చిపోయి..ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది.

లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వారు ఇప్పటివరకూ ఎవరికీ జవాబుదారీగా ఉండేవారు కాదు. చివరికి పెద్దలకు కూడా తమ విషయాన్ని చెప్పే వారు కాదు. కానీ, ఇప్పుడు వారు సహజీవన సంగతులను కేంద్రానికి చెప్పాలి. ఎందుకంటే కేంద్రం వచ్చే ఏడాది నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి జనగణన చేపడుతోంది. ఈనేపథ్యంలో ఎన్యూమరేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సహజీవనం చేసే వారు తమ భాగస్వామ్యుల వివరాలు వెల్లడించాలి.

Also Read: విదేశీ నిధులతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు.. స్వచ్ఛంద సంస్థలపై గట్టి దెబ్బ కొట్టిన కేంద్రం

కేంద్రం జనగణను రెండు విడతలలో చేపట్టనుంది. మొదటి విడతలో ఇళ్ల వివరాలు సేకరిస్తుంది. రెండో దశలో జనాభా లెక్కలను సేకరిస్తుంది. ఈ గణనకు కేంద్రం ఏకంగా 33 ప్రశ్నలను రూపొందించింది. మనదేశంలో అన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఒకే విధంగా ఉండదు. పర్వత, మంచు, ఎడారిప్రాంతాలలో వేర్వేరు సమయాలతో జనగణన చేపడుతుంది. ఈప్రాంతాలలో జనాభా వివరాలు సేకరించేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది.

జనగణన తర్వాత కేంద్రం అనేక పథకాలు అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మనదేశంలో ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తోంది. 2027 సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి జనగణన మొదలవుతుందని సమాచారం. ఇటీవల కేంద్రం 2011 జనాభా లెక్కల ఆధారంగానే చట్టసభల సీట్ల పెంపు ఉంటుందని ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular