Homeజాతీయ వార్తలుWorld Most Polluted Cities 2022: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా.. ఢిల్లీ ఫస్ట్

World Most Polluted Cities 2022: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా.. ఢిల్లీ ఫస్ట్

World Most Polluted Cities 2022: ప్రపంచవ్యాప్తంగా అతీ తీవ్ర వాయు కాలుష్య నగరాలు 20 ఉంటే.. అందులో ఎక్కువగా భారతదేశంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ ఢిల్లీ నగరం ప్రథమ స్థానంలో నిలవడం భయం గొల్పుతోంది. అమెరికాకు చెందిన ‘హెల్త్ ఎఫెక్ట్ ఇనిస్టిట్యూట్’ బుధవారం సర్వే వివరాలను వెల్లడించింది. 2018, 19 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 7 వేల నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలను గుర్తించినట్టు తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం (పీఎం 2.5)సగటును ఈ సంస్థ సమగ్ర సర్వే చేసింది. ఇందులో మన దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. పీఎం 2.5 కాలుష్యం కారణంగా ఆ 7 వేల నగరాల్లో ఒక్క 2019లోనే 17 లక్షల మరణాలు సంభవించినట్టు సర్వేలో వెల్లడైంది. ఆసియా, ఆఫ్రికా, మధ్య ఐరోపా దేశాల్లో కాలుష్య ప్రభావం అధికమని సర్వే తేల్చింది. అయితే కాలుష్యబారిత నగరాలు ఇండియాలో 18 ఉండడం భయాందోళనకు గురిచేస్తోంది. అంతకంటే ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ప్రమాద ఘంటికగా భావిస్తున్నారు. ఆ తరువాత స్థానంలో కోల్ కత్తా ఉంది. ముంబాయి నగరం 14వ స్థానంలో నిలిచింది. టాప్ 20 లో మరే ఇతర నగరాలు లేకపోవడం ఇండియాకు ఉపశమనం కలిగించే విషయం. కానీ ఈ కాలుష్యం అత్యధిక స్థాయి పెరుగుతున్న నగరాలు ఇండియాలో 51 ఉన్నట్టు తెలియడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

World Most Polluted Cities 2022
World Most Polluted Cities 2022

అత్యంత ప్రమాదకరం..
గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం (పీఎం 2.5) అత్యంత ప్రమాదకరం. ఈ వాయువును పిల్చినట్టయితే సగటు జీవన ప్రమాణం తగ్గిపోయినట్టే. ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లినట్టే. ఈ కాలుష్యం కారణంగా లక్ష మంది జనాభాలో 124 మరణాలతో చైనా రాజధాని బీజింగ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో మనదేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందిలో కాలుష్యం బారిన పడి 106 మంది మృత్యువాత పడుతున్నారు. కలకత్తాలో అయితే 99 మరణాలు సంభవిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అయితే ఈ ప్రాణాంతాక కాలుష్యం అధికంగా ఉన్న జాబితాలో టాప్ 20లో చైనాలో ఐదు నగరాలు ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నెట్ వర్కుతో సర్వే చేసిన హెల్త్ ఎఫెక్ట్ ఇనిస్టిట్యూట్ 106 నగరాలను మాత్రమే ర్యాంకింగ్ ల కోసం పరిగణలోకి తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Also Read: Team India New jersey : 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా టీమిండియా కొత్త జెర్సీ.. వైరల్

World Most Polluted Cities 2022
World Most Polluted Cities 2022

నాటి హెచ్చరికలతో మేల్కొని ఉంటే..
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కాలుష్యంపై ఎప్పటి నుంచో ప్రపంచ దేశాలకు హెచ్చరికలు పంపింది. కానీ ఆయా దేశాలు పెడచెవిన పెట్టాయి. కనీస నిబంధనలు పాటించకుండా ముప్పును కొని తెచ్చుకున్నాయి. తీరా ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టకున్న చందంగా ఇప్పుడు ఉపశమన చర్యలు ప్రారంభించాయి.అటుఎన్ఓ2 ఎక్స్‌పోజర్ పరంగా చూసుకుంటే చైనాలోని షాంఘై అత్యంత చెత్త నగరంగా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌లోని ఏ నగరం కూడా టాప్-20లో లేకపోవడం గమనార్హం. 2019లో ఢిల్లీలో సగటు పీఎం 2.5 ఎక్స్‌పోజర్ ప్రతి క్యూబిక్ మీటర్‌కు 110 మైక్రోగ్రాములు ఉన్నట్టు తేలింది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాముల కంటే 22 రెట్లు ఎక్కవ కావడం గమనార్హం. ఇది కోల్‌కతాలో 84 మైక్రోగ్రాములుగా ఉంది. 2019 నివేదికలో చేర్చిన 7 వేల కంటే ఎక్కువ నగరాల్లో 86 శాతం కాలుష్య కారకాలకు గురయ్యాయి. ఫలితంగా దాదాపు 2.6 బిలియన్లమందిపై ఇది ప్రభావం చూపినట్టు నివేదిక పేర్కొంది.

Also Read:Communists Party Kodandaram: మునుగోడులో క‌మ్యూనిస్టులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీ ప‌డుతున్న నేత‌లు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version