
Delhi Liquor Scam- Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు పెద్ద హైడ్రామాకు తెర లేపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎడి ఆఫీసు, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర భారీగా కేంద్ర బలగాలు వ్యవహరించడంతో అసలు ఏం జరుగుతుందనేది అంతు పట్టకుండా ఉంది.
వాస్తవానికి ఇవాళ ఉదయం 11:30 నిమిషాలకు కవిత విచారణకు హాజరు కావాలి. ఆమె మొన్ననే ఢిల్లీ వెళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇతర ఇంటలిజెన్స్ అధికారులు నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం 11:30 నిమిషాలకు కవిత విచారణ ఉన్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ ఉంటుందని భారత రాష్ట్ర సమితి నాయకులు అధికారికంగా ప్రకటించారు. అయితే 10 గంటలు దాటినప్పటికీ కవిత మీడియా ముందుకు రాలేదు. తర్వాత సరిగ్గా 11 గంటలకు ఈ డి ఆఫీస్ కి వెళ్లాల్సి ఉన్నా 11:30 దాటినా కవిత ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అరగంట పాటు కవిత నివాసంలో ఏం చేశారు? ఎవరెవరితో చర్చించారు? చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి గురువారం ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు మాట్లాడతారని అందరూ భావించారు. సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం, మొదటిసారి ఈ డి విచారణ వ్యవహారం.. అన్ని క్లారిటీగా మాట్లాడతారని భారత రాష్ట్ర సమితి శ్రేణులు భావించాయి. అది కూడా ఈడీ విచారణకు ముందు మీడియా మీట్ కావడంతో అందరిలోనూ సర్ ఆసక్తి నెలకొంది. కవిత నీవాసం నుంచి ఎప్పుడు బయటికి వస్తారా అని మీడియా ప్రతినిధులు వేచి చూశారు. కానీ ఆమె మీడియా ముందుకు రాలేదు. చివరికి మీడియా మీట్ రద్దయింది. దీంతో భారత రాష్ట్ర సమితి నిరాశకు గురయ్యాయి.

ఇక ఈడీ విచారణకు ఉదయం 11 గంటలకు బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కవిత ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ డి ఆఫీస్ నుంచి ఎస్కార్ట్ వాహనాలు కూడా కవిత ఉండే నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇక 11 గంటలైనా కవిత ఇంటి నుంచి బయటకు రాలేదు. చివరికి 11:30 నిమిషాలు దాటినా కూడా కవిత బయటి రాకపోవడం, అసలు విచారణకు హాజరవుతారా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీంతో 11 నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యలో కవిత ఏం చేశారు? ఎవరితో మాట్లాడారు అనే విషయాలను తెలుసుకునేందుకు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆసక్తి చూపించారు. మొదట మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కవిత చర్చించారని తెలుస్తోంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి అరగంట పాటు భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ ప్రతినిధులతో తీవ్రంగా చర్చించారు. అనంతరం అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. విచారణకు హాజరు కాలేనని న్యాయవాదుల ద్వారా ఈడికి కవిత సమాచారం పంపారు. భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈ సమాచారాన్ని కవిత ఈడికి చేరవేశారు. చివరికి ఎస్కార్ట్ వాహనాలు కవిత నివాసం నుంచి ఈ డి ఆఫీస్ కు వెను దిరిగాయి.
ఇక గురువారం నాడు ఈడి విచారణపై స్టే కావాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ పై ఈనెల 24న విచారణ చేపడతామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తో ఈ విషయాన్ని ఈ డి అధికారులకు తన న్యాయ ద్వారా పంపినట్టు తెలిసింది. తర్వాత అధికారికంగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈడి విచారణకు హాజరు కాలేనని కవిత తన న్యాయవాదుల ద్వారా తెలిపింది. ఆ తర్వాత తాను అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేనని, తనకు మరో తేదీ నిర్ణయించాలని కూడా న్యాయవాది ద్వారా కవిత కోరారు. అయితే కవిత విజ్ఞప్తిని ఈడి అధికారులు అంగీకరించలేదు. ఆఖరికి మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని కవిత నిర్ణయించుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మధ్యాహ్నం ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.