
Transgender Priyanka Marriage: ప్రియాంక అలియాస్ పింకీ సడన్ గా పెళ్లి ప్రకటన చేశారు. స్వయంగా యూట్యూబ్ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే చివర్లో ట్విస్ట్ ఇచ్చి అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యారు. సాయి తేజగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసేవాడు. రంగు, రూపు, నడక అచ్చు అమ్మాయిలా ఉండేవాడు. సాయి తేజను చూస్తే అబ్బాయి అమ్మాయి వేషం వేశాడన్న భావన కలగదు. జబర్దస్త్ నుండి మాయమైన సాయి తేజ 2021లో బిగ్ బాస్ హౌస్లో ప్రత్యక్షమయ్యాడు.
ఈ గ్యాప్ లో అతడు పూర్తిగా అమ్మాయిగా మారాడు. ఆపరేషన్ చేయించుకుని సాయి తేజ కాస్తా ప్రియాంక అవతారం తెచ్చాడు. తాను ట్రాన్స్ జెండర్ అన్న విషయాన్ని ప్రియాంక బిగ్ బాస్ హౌస్లో స్వయంగా చెప్పింది. ఈ సంగతి చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. తన పేరెంట్స్ కి సారి చెప్పారు. తనను అర్థం చేసుకోవాలని వేడుకుంది. సీజన్ 5లో పాల్గొన్న ప్రియాంక జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఆమె పది వారాలకు పైగా హౌస్లో ఉన్నారు.
ఈ ట్రాన్స్ జెండర్ ప్రియాంక బిగ్ బాస్ హౌస్లో ఎఫైర్ నడపడం విశేషం. సీరియల్ నటుడు మానస్ మీద ప్రియాంక అమితమైన ప్రేమ చూపించేసింది. అతనికి సేవలు చేసుకోవడం, చుట్టూ తిరగడం చేసేది. మొదట్లో దూరం పెట్టిన మానస్ తర్వాత ఆమెను అంగీకరించారు. ప్రియాంకతో సన్నిహితంగా ఉండేవాడు. ఇటీవల ప్రియాంక బీబీ జోడీలో పాల్గొంటున్నారు. ఈ డాన్స్ రియాలిటీ షోలో ప్రియాంక అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నారు.

కాగా ప్రియాంక సడన్ గా పెళ్లి ప్రకటన చేసింది.ఈ మేరకు వీడియో విడుదల చేసింది. నా హల్దీ వేడుకల ఫోటోలు చూసిన ఫ్యాన్స్ పెళ్లి గురించి అడుగుతున్నారు. అవును నేను వివాహం చేసుకోబోతున్నాను. అయితే పేరెంట్స్ ఒప్పుకొని అంతా సెట్ అయ్యాక చెబుదామని ఆగాను. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో ఈ వీడియో చివర్లో తెలియజేస్తాను. ముందు పెళ్లి కోసం నగల షాపింగ్ చేద్దాం అంటూ… వీడియో స్టార్ట్ చేసింది. చివర్లో జస్ట్ ఫ్రాంక్ అంటూ షాక్ ఇచ్చింది. ప్రియాంక పెళ్లి వార్త నిజమనుకున్న ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వ్యూస్ కోసం జనాల్ని వెధవల్ని చేయకు అంటూ… ఆమెను ఏకిపారేస్తున్నారు. ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.