All Parties For Sake Of Power: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధికార పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దీంతో ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. నాలుగు రాష్ట్రాల్లో 16 సీట్లకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో సైతం ప్రతిపక్షాలు తమ సత్తా చూపాలని ప్రయత్నించాయి. కానీ వారి కోరిక మాత్రం తీరలేదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. దీంతోనే అన్ని ప్రాంతాల్లో పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నాయి.

దేశంలో ఎన్నికల వాతావరణం మెల్లగా వేడెక్కుతోంది. బీజేపీయేతర ప్రభుత్వం కోసం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అనుసరించబోయే వ్యూహంపై నిన్న సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించి తమ వైఖరి ప్రకటిస్తారని అనుకున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో జాతీయ పార్టీ కోసం కేసీఆర్ ఇప్పటికే పలువురిని కలిసినా వారి నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది.

Also Read: Kavitha Is Correct: కవిత చెప్తే కరెక్టే.. జూలై నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు!
కాంగ్రెస్ సైతం బీజేపీని ఎదుర్కోవాలని భావించినా అది సాధ్యం కాదనే తెలుసుకుని నిశ్శబ్దంగా ఉండిపోతోంది. కేసీఆర్ మాత్రం బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నా అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఈనేపథ్యంలో దేశంలో మూడో కూటమి ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కాకపోవచ్చని చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలపైనే ప్రధాన దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తానికి రాజకీయ వేడి మాత్రం ఇప్పుడే రగులుతోంది.

రాజకీయంగా అన్ని పార్టీలు తమ ఉద్దేశాలు, మేనిఫెస్టోల రూపకల్పనలో తలమునకలయ్యాయి. ఇప్పటికే ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాయి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. బీజేపీ అధికార పార్టీ కావడంతో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకునే క్రమంలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఇందుకోసం బీజేపీకి దీటుగా తన కార్యక్రమాలు ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. మొత్తానికి దేశంలో ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Both Are Gay: ఇద్దరూ ‘గే’లే: కోరిక తీర్చమన్నందుకు ఒక గే ఏం చేశాడంటే?