Hero Nani: న్యాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..మొదటి రోజు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోయినా కూడా..ఫుల్ రన్ లో ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..రెండవ రోజు మల్టీప్లెక్స్ బుకింగ్స్ ఈ సినిమాకి అద్భుతంగా ఉన్నాయి..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమా షూటింగ్ కొంత వరుకు USA లో జరిగింది అట..ఆ సమయం లో అక్కడ లాక్ డౌన్ ఉండడం తో షూటింగ్ కి అనుమతిని ఇవ్వలేదట..దీనితో అక్కడి పోలీసులతో ఆ సమయం లో ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ కి పెళ్లి కాబోతుంది అని..అతని కాబొయ్యే వైఫ్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వీడియో ని షూట్ చేస్తున్నాం అని అబద్దం చెప్పి షూటింగ్ చేశారట.

Also Read: Rajamouli: నార్త్ వాళ్ళ పొగరు అణిచిన రాజమౌళి!
అలా అమెరికా పోలీసులని ఏమార్చి సినిమా షూటింగ్ చెయ్యక తప్పలేదు అని నాని ప్రొమోషన్స్ లో చెప్పుకొచ్చాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 30 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..కానీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ సినిమా వీక్ డేస్ లో కచ్చితంగా బాగా ఆడాల్సిన పరిస్థితి ఉంది..ఎందుకంటే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి 7 కోట్ల రూపాయిల షేర్ వస్తుంది అని ఊహిస్తే..కనీసం నాలుగు కోట్ల రూపాయిలు కూడా రాలేదు..ఈ వీకెండ్ మొత్తం బాగానే వసూళ్లు వస్తున్నప్పటికీ కూడా అవి సరిపోవు అనే చెప్పాలి..నాని కి ఫామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం..అలాగే టాక్ కూడా బాగా ఉండడం తో ఫుల్ రన్ వసూళ్లు బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు..చూడాలి మరి ట్రేడ్ వర్గాల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది..ఈ సినిమా తర్వాత నాని దసరా అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడితో ఈ సినిమాని చేస్తున్నాడు నాని..దాదాపుగా 60 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై నాని చాలా ఆశలే పెట్టుకున్నాడు..మరి ఆయన ఆశలను ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో చూడాలి.

Also Read: Central Government New Portal: కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్.. ఇక ఈజీగా ఆన్‌లైన్ లోన్..
Recommended Video:
[…] […]
[…] […]