మరోసారి ఎల్.జి నుంచి గ్యాస్ లీక్..!

విశాఖపట్నంలో పెను ఉత్పాతం సృష్టించిన ఎల్.జి పాలిమర్స్ నుంచి మరోసారి ప్రమాదకరమైన వాయువు వెలువడుతుంది. ఉదయం వాయువు వెలువడటం నిలిపి వేయగలిగామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. విశాఖలో భారీ ప్రమాదం…! తాజాగా రెండవసారి స్వల్పంగా ప్రమాదకర వాయువు విడుదలవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమవుతున్న సమీప ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం అక్కడికి వచ్చిన పోలీసులు పరుగులు పెడుతున్నారు. తెల్లవారు జామున విడుదలైన వాయువు కారణంగా పరిశ్రమ సమీపంలోని వృక్షాలు ఎండిపోయాయని ప్రత్యక్ష సాక్షులు […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 1:24 pm
Follow us on


విశాఖపట్నంలో పెను ఉత్పాతం సృష్టించిన ఎల్.జి పాలిమర్స్ నుంచి మరోసారి ప్రమాదకరమైన వాయువు వెలువడుతుంది. ఉదయం వాయువు వెలువడటం నిలిపి వేయగలిగామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

విశాఖలో భారీ ప్రమాదం…!

తాజాగా రెండవసారి స్వల్పంగా ప్రమాదకర వాయువు విడుదలవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమవుతున్న సమీప ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం అక్కడికి వచ్చిన పోలీసులు పరుగులు పెడుతున్నారు. తెల్లవారు జామున విడుదలైన వాయువు కారణంగా పరిశ్రమ సమీపంలోని వృక్షాలు ఎండిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జంతువులు, ఇతర జీవరాశులు పక్షులు, పశువులు మృతి చెందాయి.

విశాఖ గ్యాస్‌ లీక్‌ పై జగన్ కు ప్రధాని ఫోన్

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్రం అనుమతి తో హైదరాబాద్ నుంచి ఇప్పటికే విశాఖ ప్రయాణమయ్యారు.