Telangana Liberation Day: భారతదేశానికి మొత్తం స్వాత్రంత్యం వచ్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా పండుగ చేసుకుంటోంది. కానీ ఒకే ఒక్క ప్రాంతం మాత్రం చిమ్మి చీకట్లలో మగ్గుతోంది. ఇంకా స్వాత్రంత్యం ఫలాలు వారికి అందలేదు. ఇంకా నిజాం కబంధ హస్తాల్లో చీకటి రాజ్యాం ‘హైదరాబాద్ సంస్థానం’లో నడుస్తోంది. భారతదేశ ప్రజలు ఓ వైపు సంబరాలు చేసుకుంటుంటే.. పక్కనే ఉన్న ఆంధ్రులు జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తుంటే.. ‘హైదరాబాద్ సంస్థానం’ మాత్రం నిజాం రాజు గుప్పిట్లో స్వేచ్ఛలేని సంకెళ్లతో చేష్టలుడిగి బానిస బతుకులు బతుకుతోంది.
ప్రస్తుతం తెలంగాణ ఒకప్పుడు నిజాం రాజు పాలించిన ‘హైదరాబాద్ సంస్థానం’లో భాగంగా ఉండేది. కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు నిజాం నియంత పాలనలో ఉండేవి. అయితే ఆయా ప్రాంతాల్లో ఈ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ మేజర్ పార్ట్ ఉన్న తెలంగాణలో మాత్రం ఈ పండుగను అధికారికంగా వేడుకగా నిర్వహించకపోవడమే ఇక్కడి ప్రజల దురదృష్టంగా చెప్పొచ్చు..
భారత దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత విముక్తి పొందిన తెలంగాణ ప్రజలు ఈ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని వేడుకగా నిర్వహించకుండా.. ఎవరి ప్రోద్బలంతోనే దీన్ని తొక్కేస్తున్న తీరుపై తెలంగాణ ప్రజలు, నేతలు, మేధావులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి..
సెప్టెంబర్ 17న 1948లో తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. అధికారికంగా భారత్ లో ‘హైదరాబాద్ సంస్థానం’ విలీనం అయ్యింది. ఆగస్టు 15న దేశానికి స్వాంతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నాం.. మరి తెలంగాణ స్వాతంత్ర్య దినం ఎందుకు జరుపుకోవడం లేదన్నది అందరి నుంచి ఉదయిస్తున్న ప్రశ్న.. కేసీఆర్ సర్కార్ చెప్పే కారణాలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే.. ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత ఇలాంటి కారణాలు చెప్పడమేనేది నిజంగా సిగ్గు చేటు.
నాడు భారత ఆర్మీ, సర్ధార్ వల్ల భాయ్ పటేల్ ఆధ్వర్యంలో తెలంగాణపై దండెత్తి నిజాం సైన్యంను ఓడించి విలీనం చేయకపోతే అసలు ఈరోజు తెలంగాణ ఇంత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో ఉండేది కాదు. మరి అలాంటి తెలంగాణ విమోచన పండుగను ఇక్కడి ప్రభుత్వం ఎందుకు జరపడం లేదన్నది ప్రశ్న.. ఇప్పటికైనా పాలకులు ఈ సంకుచిత రాజకీయాలను విడనాడి ఈ తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని మనసారా జరుపుకోవాల్సిన అవసరం ఉంది.
‘తెలంగాణ విమోచనం.. తదినంతర పరిణామాలు.. ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు’పై ‘రామ్ టాక్’ ప్రత్యేక వీడియోలో మరిన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం..