CM Jagan- AP Govt Employees: వేధించడం, కాళ్లు పట్టించుకోవడం..జగన్ సర్కార్ కు పరిపాటైంది!

ఏపీ ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు తో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఈ దృశ్యాలను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది.

Written By: Bhaskar, Updated On : June 13, 2023 1:07 pm

CM Jagan- AP Govt Employees

Follow us on

CM Jagan- AP Govt Employees: సమస్యను సృష్టించడం, మళ్లీ దానిని పరిష్కరించినట్టు కవర్ చేయడం, ఈ మధ్యలో కాళ్ళు పట్టించుకోవడం.. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.. గతంలో టికెట్ల పెంపునకు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులను తన వద్దకు రప్పించుకున్న జగన్.. వారితో కాళ్లు పట్టించుకున్నంత పని చేశాడు.. అనేక విజ్ఞప్తుల తర్వాత బిట్టు వీడాడు.. చివరికి టాలీవుడ్ ప్రముఖులు చెప్పినట్టు చేశాడు.. ఈ ఎపిసోడ్లో టాలీవుడ్ ప్రముఖులకు జగన్ అంటే ఏంటో తెలిసింది. అతడి నిజ స్వరూపం కళ్ళకు గట్టింది. తర్వాత కొద్ది రోజులపాటు దీని గురించి ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా చర్చ జరిగింది.. జగన్ హామీ ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల టికెట్ రేట్లు గిట్టుబాటు కాకపోవడంతో చాలావరకు ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసుకున్నారు.. కొన్నిచోట్ల మూత పడిన థియేటర్లు ఇంతవరకు తెర్చుకోలేదు. జగన్ విశ్వరూపం కేవలం టాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే పరిమితం కాలేదు.. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా అనుభవంలోకి వచ్చింది.

పాపం ఉద్యోగులు

ఏపీ ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు తో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఈ దృశ్యాలను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. అందులో ఉన్న బండి శ్రీనివాసరావు హావాభావాలు చూస్తే ఎవరికైనా జాలి అనిపించక మానదు. బండి శ్రీనివాసరావు బృందాన్ని చూస్తే టాలీవుడ్ నుంచి వెళ్లిన సినీ ప్రముఖులే గుర్తుకు వస్తారు. అంతటి చిరంజీవితో బతిమాలించుకుని జగన్ వికాటట్టాహాసం చేశాడు. అప్పట్లో ఆ దృశ్యాలను తన సొంత మీడియాలో ప్రచారం చేయించుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా వాటిని విడుదల చేశాడు. ఇక ఇప్పుడు బండి శ్రీనివాసరావు అండ్ కో దృశ్యాలు కూడా అలానే విడుదల చేశాడు.

ఎందుకు పొగుడుతున్నారో

వైరల్ చేసేందుకే వాటిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. అవి ఎడిట్ చేసిన ఫోటోల్లాగానే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన వారికి వారెందుకు అలా పొగుడుతున్నారో తెలుసు. ముఖ్యమంత్రిలో ఇంత సైకోతనమా అని ఆశ్చర్యపోవడం వారి వంతవుతుంది.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టి కాళ్ళు పట్టించుకోవడమే అని అవగతమవుతోంది.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఆర్సి ఇచ్చారు. 20% మధ్యంతర భృతి కల్పించారు. కానీ జగన్ మొత్తం డీఏ లను పిఆర్సి లో కలిపేసి నిలువునా మోసం చేశారు. ఇంకా మిగతా ప్రయోజనాలు కూడా అడ్డగోలుగా పక్కన పెట్టారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ముని కూడా వాడుకున్నారు. డీఏ లు కూడా ఇవ్వడం లేదు. ఒక డీఏ ప్రకటిస్తే వచ్చే నాలుగైదు ఏళ్లలో బకాయిలు చెల్లిస్తామని చెప్తున్నారు. వీరిని మాత్రమే కాకుండా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా మోసం చేశారు. నోరు ఎత్తితే అరెస్టులు చేస్తామని బెదిరించారు. నలుగురు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అరెస్టు చేశారు. మా ఉద్యోగ సంఘం నాయకుడిని పరారయ్యేలా చేశారు. ఇలాంటి చర్యలతో ఉద్యోగులను కాళ్ల దగ్గరికి తెచ్చుకున్నారు.. కొంతమందితో ఏకంగా కాళ్లు కూడా పట్టించుకున్నారు. జగన్ తరహా లోనే ఆయన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. రేపు వీరంతా పదవులు కోల్పోయిన తర్వాత అసలు వీరి స్థానాన్ని జనం నిర్దేశిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. తన అధికారాన్ని చూపించుకుంటున్న వైఎస్ఆర్సిపి నాయకుల తీరు.. అత్యంత దారుణంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు