https://oktelugu.com/

కత్తి మహేష్ ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఇదీ

ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ కారుకు ప్రమాదం జరగడం.. ఆయన సీరియస్ గా ఉన్నాడన్న వార్తలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సోషల్ మీడియాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి క్లారిటీ ఇచ్చాడు. కత్తి మహేష్ కన్ను పూర్తిగా దెబ్బతిందని.. ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని.. మూడురోజుల వరకు ఏం చెప్పలేమని వైద్యులు అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ క్లారిటీ ఇచ్చారు. నిన్న సాయంత్రం […]

Written By: , Updated On : June 27, 2021 / 03:35 PM IST
Follow us on

ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ కారుకు ప్రమాదం జరగడం.. ఆయన సీరియస్ గా ఉన్నాడన్న వార్తలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సోషల్ మీడియాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి క్లారిటీ ఇచ్చాడు.

కత్తి మహేష్ కన్ను పూర్తిగా దెబ్బతిందని.. ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని.. మూడురోజుల వరకు ఏం చెప్పలేమని వైద్యులు అన్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ క్లారిటీ ఇచ్చారు. నిన్న సాయంత్రం కత్తి మహేష్ కోమాలోకి వెళ్లలేదని.. కేవలం షాక్ కారణంగానే సృహ కోల్పోయాడని క్లారిటీ ఇచ్చారు.

కత్తి మహేష్ ఆరోగ్యం స్తిమితంగానే ఉందని నిర్మాత వెంకట్ సిద్ధారెడ్డి తెలిపారు. మెదడుకు పెద్ద దెబ్బలేమీ తగలలేదని.. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టు వెంకట్ సిద్ధారెడ్డి తెలిపారు. ఇక కంటి వైద్యులు వచ్చి చూశాక పూర్తి సమాచారం ఇస్తారని తెలిపారు. తాము కూడా డాక్టర్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంకో గంటలో పూర్తి సమాచారం తెలుస్తుందని తెలిపారు.

ఇప్పటికైతే కత్తికి ప్రాణాపాయం అయితే లేదని అది సంతోషించాల్సిన విషయం అని వెంకట సిద్ధారెడ్డి తెలిపారు.