ఆ మూడు జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు!

తెలంగాణలో మూడు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, […]

Written By: Neelambaram, Updated On : May 20, 2020 8:30 pm
Follow us on

తెలంగాణలో మూడు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ ఉన్నాయి.

తెలంగాణలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గాయి. బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం మరో ఇద్దరు బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఇద్దరు చనిపోయారు. ఇవాళ GHMC పరిధిలో 15, మరో 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 89 మంది వలస కార్మికులు కరోనా బారినపడ్డారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1661 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,013 మంది కోలుకోగా.. 40 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 608 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.