https://oktelugu.com/

‘రంగుల’ కేసులో తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు..!

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వేసిన అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటీషనర్, ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కమీటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను జారీ వీహెసింది. ఈ జీఓలో అవే రంగులు ఉండటంతో జీఓను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. వైసీపీ జెండాలోని మూడు రంగులతో పాటు మట్టి రంగు ఒక్కటే చేర్చి […]

Written By: , Updated On : May 20, 2020 / 07:49 PM IST
Follow us on


రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వేసిన అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటీషనర్, ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కమీటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను జారీ వీహెసింది. ఈ జీఓలో అవే రంగులు ఉండటంతో జీఓను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. వైసీపీ జెండాలోని మూడు రంగులతో పాటు మట్టి రంగు ఒక్కటే చేర్చి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

జీవో నంబర్ 623 ప్రకారం పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేయాలని ఏపీ సర్కారు పేర్కొందని, మళ్లీ ప్రభుత్వ భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్ తరుపు వాదనలు వినిపించిన న్యాయవాది సోమయాజులు తెలిపారు. గతంలో విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఓ పేరుతో అవే రంగులు వేయమని ఆదేశాలు ఇవ్వడం కోర్టు ధిక్కారంగా ఎందుకు భావించకూడదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తోందోననే ఉత్కంఠ నెలకొంది.