Google Campus In Hyderabad: దేశంలో హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. అన్ని నగరాలతో పోటీ పడి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇన్నాళ్లు ఐటీలో పేరుగాంచిన బెంగుళూరును కాదని దినదినం వేగంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది. ఉపాధి రంగాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో ఉధ్యోగావకాశాలు పెంచుకుంటోంది. యువతకు జాబ్స్ అందుబాటులోకి తెస్తోంది.
గూగుల్ సంస్థ హైదరాబాద్ లో తన కార్యాలయం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. దీంతో మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగరం మరో ఐటీ కేంద్రంగా భాసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి గూగుల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది.
Also Read: CM Jagan: జగన్ సేఫ్.. డేంజర్ లో వైసీపీ ఎమ్మెల్యేలా?
ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తెలంగాణ వైపు చూస్తుండటంతో మన ప్రతిష్ట రెట్టింపవుతోంది. ఇన్నాళ్లు హైదరాబాద్ ను పట్టించుకోని సంస్థలు ఇప్పుడు మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ముదావహం. గత పదిహేనేళ్ల కాలంలో డేటా సెంటర్ అభివృద్ధికి గాను రూ. 15 వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం నిజంగా మన అదృష్టమే. అమెజాన్ సంస్థ కూడా హైదరాబాద్ కేంద్రంగా డేటా సెంటర్ ను స్థాపించడంతో రాష్ట్ర ఘనత మరింత పెరుగుతోంది.
ఇప్పటివరకు ఐటీ సెక్టార్ అంటే బెంగుళూరుగా భావించినా ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ వైపు అన్ని కంపెనీలు తరలి రావడం చూస్తుంటే మన ప్రభుత్వ కృషి దాగి ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు తరలుతున్నాయి. పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తుండటంతో యువతకు ఉపాధి కూడా ఎక్కువవుతోంది. అందుకే ప్రభుత్వం చేస్తున్న చొరవ వల్లే కార్యాలయాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ గ్లోబల్ సిటీగా మారనుందని తెలుస్తోంది. ఐటీ కంపెనీల రాకతో నగరం ముఖచిత్రమే మారిపోతోంది. ప్రపంచంలోనే అమెరికా తరువాత రెండో కార్యాలయం గూగుల్ సంస్థ నగరంలో నెలకొల్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు కూడా రావడంతో ఇక గూగుల్ రాకతో నగరం రూపురేఖలు మారనున్నట్లు తెలుస్తోంది.
నగరంలో సువిశాలమైన ప్రాంతాలు ఉండటంతోనే ఇక్కడ సంస్థలు నెలకొల్పేందుకు గూగుల్ ముందుకు వచ్చినట్లు చెబుతోంది. ఇది ఓ రకంగా ప్రజలకు ఉపాధి కల్పించడంలో మేలు జరిగేందుకే అని అభివర్ణిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు పరిశ్రమల ఏర్పాటు మనకు ప్రయోజనం కలిగించేందుకే అని చెబుతున్నారు. అందుకే గూగుల్ సంస్థ హైదరాబాద్ ను వేదికగా చేసుకుంది. తన కార్యకలాపాల విస్తరణకు అనువైన నగరంగా గుర్తించిందని తెలుస్తోంది.
Also Read:Acharya Movie Review: ఆచార్య మూవీ రివ్యూ & రేటింగ్ ..! /5?