CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏ పని చేయాలన్న నిధుల కొరతతో ఏం చేయలేని పరిస్థితి. గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం నియోజకవర్గానికి రూ.కోటి పనులు కూడా చేయకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారు. అడపదడపా పనులు చేసినా ఇంతవరకు బిల్లులు రాని పరిస్థితి. దీంతో ప్రజాప్రతినిధులమైనా ఏం లాభం లేదని వాపోతున్నారు. అధినేత వైఖరి వల్ల అభివృద్ధి పనులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
అయితే ఇప్పుడో కొత్త రాగం అందుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో సీటు రావడం కష్టమేననే వాదన వస్తోంది. సర్వేల్లో తనకు మంచి మార్కులు వచ్చినా ఎమ్మెల్యేలకు మాత్రం రావడం లేదని చెబుుతన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో చాలా మంది టికెట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Acharya Movie Review: ఆచార్య మూవీ రివ్యూ & రేటింగ్ ..! /5?
జగనే జగంగా ఎమ్మెల్యేలు ఉన్నా ఇప్పుడు వారిపై వ్యతిరేకత ఉంంటూ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకోవడంతో వారు నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. ఎంత చేసినా పేరకు రాని విధంగా ఉందని వాపోతున్నారు. తమ కోసం కనీసం ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా చేసిన పనులకే బిల్లులు చెల్లించకుండా చేయడం చోద్యంగా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్ లో కూడా తమకు ఎలాంటి లాభం ఉండదని చెబుతున్నారు.
సంక్షేమ పథకాల అమలులో కూడా ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉండటం లేదు. దీంతో కేవలం అలంకారప్రాయంగా మాత్రమే తమకు పదవులు వచ్చాయని ఎక్కడ కూడా ప్రజలతో సంబంధాలు లేకుండా చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వాలంటీర్లకు ఉన్న విలువ తమకు ఇవ్వడం లేదని తమలోని ఆవేదన వెల్లడిస్తున్నారు.
దీంతో ఎమ్మెల్యేలను మార్చేసి కొత్త వారితో ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో వారిలో ఆగ్రహం పెరుగుతోంది. సర్వేల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి భవితవ్యం ఏమిటో అనే సందేహంలో పడిపోతున్నారు. ఇన్నాళ్లు పార్టీయే సర్వస్వమని నమ్మినా చివరకు మొండిచేయి చూపించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో తనకు అనుకూలంగా వచ్చినా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎలా వస్తుందని అయోమయం చెందుతున్నారు. కావాలనే జగన్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
సర్వేల పేరుతో అందరి జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. పార్టీ కోసం పని చేసినా తమకు గుర్తింపు లేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో కూడా తమకు పిలుపు ఉండటం లేదు. ప్రజలతో కలిసే సందర్భాలే రావడం లేదు. దీంతో ప్రజల్లో గుర్తింపు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. తమకు టికెట్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారు.
Also Read:Acharya Review: First Review Of Chiranjeevi, Ram Charan Tej’s Acharya