https://oktelugu.com/

Zee Telugu Saregamapa 2022: సరిగమప షో: అదిరిపోయిన సింగర్స్, సూపర్ సింగర్స్ జోడీ.. ఎన్నో ఎమోషన్స్

Zee Telugu Saregamapa 2022: సరిగమప షో కొత్త పుంతలు తొక్కింది. తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశీ మూలల నుంచి వచ్చిన ఎంతో మంది పేద, సామాన్య కళాకారులు వచ్చి ఈ షోలో తమ సత్తా చాటుతున్నారు. వారి గాన మాధుర్యాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. పేదింటి ఆడకూతురు పార్వతి, ఇక భర్తకు దూరమైన కళ్యాణి ఇలా.. ఎంతో మంది పాటలే ప్రాణంగా ఈ స్టేజీపై అదరగొట్టారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఇటీవలే పార్వతి, కళ్యాణి , […]

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2022 / 12:54 PM IST
    Follow us on

    Zee Telugu Saregamapa 2022: సరిగమప షో కొత్త పుంతలు తొక్కింది. తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశీ మూలల నుంచి వచ్చిన ఎంతో మంది పేద, సామాన్య కళాకారులు వచ్చి ఈ షోలో తమ సత్తా చాటుతున్నారు. వారి గాన మాధుర్యాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. పేదింటి ఆడకూతురు పార్వతి, ఇక భర్తకు దూరమైన కళ్యాణి ఇలా.. ఎంతో మంది పాటలే ప్రాణంగా ఈ స్టేజీపై అదరగొట్టారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఇటీవలే పార్వతి, కళ్యాణి , కీర్తనలు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఇక గెస్ట్ సింగర్స్ కొందరు అద్భుతంగా పాడి అలరించారు.తాజాగా వచ్చే ఆదివారానికి సంబంధించిన ‘సరిగమప షో’ ప్రోమో విడుదలైంది.ఇదిప్పుడు వైరల్ గా మారింది.

    Zee Telugu Saregamapa

    సరిగమప షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు జోడీగా ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడుతూ పాపులర్ అయిన సూపర్ సింగర్స్ ఈ షోకు గెస్టులుగా వచ్చారు. అంతేకాదు.. సరిగమప షో లో పాడే వర్ధమాన సింగర్స్ తో కలిసి పాటలు ఆలపించారు. ఇది అద్భుతంగా సాగింది. వీరి జోడీ పాటలకు జడ్జీలు, కంటెస్టెంట్లు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

    Also Read: Google Campus In Hyderabad: అమెరికా తర్వాత హైదరాబాద్ నే ‘గూగుల్’ ఎందుకు ఎంచుకుంది?

    ముందుగా సినిమాల్లో పాటలు పాడుతున్న ప్రముఖ సింగర్స్ అందరినీ ఆహ్వానించారు. ఆర్ఆర్ఆర్ లో ‘దోస్తీ’ సహా ఎన్నో పాపులర్ పాటలు పాడిన హేమచంద్ర ముందుగా ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం హరిచరణ్, కారుణ్య, కులకర్ణి, సాకేత్ సహా ఎంతో పాపులర్ సింగర్స్ సరిగమప షోపై సందడి చేశారు.

    వీరందరూ సరిగమప షో సింగర్స్ తో కలిసి జోడీగా ఆలపించిన పాటలు నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగాయి. వీరి గానామృతానికి అందరూ పులకించిపోయారు. మాటలు రాని పరిస్థితి ఎదురైంది. అద్భుతమైన ఈ ఎపిసోడ్ ప్రోమో చూశాక షో ఎప్పుడు చూస్తామా? అన్న ఆసక్తి కలిగింది.

    Zee Telugu Saregamapa

    ఇక పాటల మధ్యలో యాంకర్ శ్రీముఖి సరిగమప సింగర్ చరణ్ తో కలిపిన పులిహోర నవ్వులు పూయించింది. ఇక ఆ తర్వాత ఇండియన్ ఐడల్ కారుణ్య జోడీ ఉర్రూతలూగించింది. కారుణ్య కరోనా టైంలో తన జీవితంలో జరిగిన ఒక సరదా ‘ఊపిరి శ్వాస’ సంఘటనను పంచుకొని కామెడీ పండించాడు. ఆ తర్వాత కులకర్ణి జోడీ పాట ప్రేమలోకంలో విహరింపచేసింది. ఇక ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్ లోని’ డీజే కొట్టు సాంగ్ తో సింగర్ సాకేత్, శివాణీ జోడీ స్టేజీని దడదడలాండించింది. వీరిద్దరి పాటకు అందరూ ఎగిరి గంతేశారు.

    ఇక వర్ధమాన గాయకుడు ప్రణవ్ పాడుతుండగా అతడి కోసం తండ్రి అమెరికా నుంచి రాగా దాన్ని సీక్రెట్ గా దాచి ఉంచి రూంలోంచి స్టేజీపైకి తీసుకొచ్చారు. ప్రణవ్ కు అపురూపమైన షాక్ ఇచ్చారు. అమెరికాలో ఉన్న తండ్రి స్టేజీపై కనిపించడంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన ప్రణవ్ ఎమోషనల్ అయ్యారు. తండ్రిని చూసి ఫిదా అయ్యారు. ఇక ప్రణవ్ కు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన సినిమా అవకాశాన్ని స్టేజీపై ప్రకటించారు. ఇక చివరగా రంజాన్ సెలబ్రేషన్స్ తో దీన్ని ముగించారు.

    ఇలా సరిగమప షోలో పాటల పూదోటలో విహరించడమే కాదు.. మధ్యలో సూపర్ సింగర్స్ ఎంట్రీ.. గాయకుల గురించి సరికొత్త విషయాలను పరిచయం చేస్తూ ఎంతో సరదా సరదాగా ముందుకు సాగించారు. ఈ షోపై మరింత అంచనాలు పెంచారు. వచ్చే ఎపిసోడ్ ను మిస్ కాకూడదన్న భరోసాను ఈ ప్రోమో నింపిందనే చెప్పాలి.

    Also Read:Chiranjeevi-Balakrishna: చిరంజీవి-బాలయ్య మల్టీస్టారర్ మూవీ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

     

    Recommended Videos:

    Tags