https://oktelugu.com/

బిగ్ బాస్-4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న కమెడీయన్లు?

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో ఆదివారం ప్రారంభిమైంది. తెలుగు రియల్టీ షోలలో ఇప్పటివరకు బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీజన్లు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. టీఆర్పీ రేటులో దూసుకుపోయి అటూ నిర్వహాకులను.. ఇటూ ప్రేక్షకులను అలరించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకేచోట చేర్చి ప్రేక్షకులకు బిగ్ బాస్ వినోదం పంచుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులతో ఇకపై షోలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2020 / 03:46 PM IST

    Biggboss wildcard entry

    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో ఆదివారం ప్రారంభిమైంది. తెలుగు రియల్టీ షోలలో ఇప్పటివరకు బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీజన్లు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. టీఆర్పీ రేటులో దూసుకుపోయి అటూ నిర్వహాకులను.. ఇటూ ప్రేక్షకులను అలరించింది.

    వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకేచోట చేర్చి ప్రేక్షకులకు బిగ్ బాస్ వినోదం పంచుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులతో ఇకపై షోలో నవ్వులు, ఏడుపులు, వినోదం వంటి ఎన్నో ఎమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. త్వరలోనే బిగ్ బాస్ టాస్కులు మొదలు కానుండటంతో ప్రస్తుతం ఉన్న 16మంది కంటెస్టుల్లో ఎవరు ఎలిమేనేట్ అవుతారు? ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

    ప్రస్తుత బిగ్ బాస్-4లోని కంటెస్టులంతా ఎవరికీవారు తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక కింగ్ నాగార్జున హోస్టింగ్ ప్రత్యేకంగా కన్పిస్తోంది. గతంలో కంటే భిన్నంగా నాగార్జున డబుల్ యాక్షన్లో అదరగొడుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టులను ఆటపట్టిస్తూ సరదాగా షోను కొనసాగిస్తున్నాయి. ఈ వినోదాన్ని మరింత పెంచేలా బిగ్ బాస్-4లో టాలీవుడ్ కు చెందిన పలువురు కామెడీయన్లు షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారనే టాక్ విన్పిస్తోంది.

    వీరిలో ప్రధానంగా జబరస్త్ కామెడీయన్ ముక్కు అవినాష్ పేరు విన్పిస్తుంది. మెయిన్ ఎంట్రీలోనే అవినాష్ పేరు విన్పించినా చివరివరకు నిలువలేకపోయింది. దీంతో అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తాడనే టాక్ విన్పిస్తోంది. అదేవిధంగా ఈరోజుల్లో ఫేమ్ కామెడియన్ సాయికుమార్ పేరు కూడా విన్పిస్తుంది. సాయికుమార్ ఈరోజుల్లో, బస్ స్టాఫ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వీరిద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు బిగ్ బాస్-4లో తొలి ఎలిమినేషన్ ను ఎవరు ఎదుర్కొంటారనేది ఉత్కంఠగా మారింది.