తెలంగాణలో పెరగనున్న భూముల రేట్లు ..!

కరోనా, ఇతర కారణాలతో ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు  భూములను అమ్మేందుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని భూములకు వేలం నిర్వహించేందుకు టెండర్లను జారీ చేసింది. అయితే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల మార్కెట్ వ్యాల్యూను కూడా పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా రియల్ ఎస్టేట్ దందాలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో ఉంది. […]

Written By: NARESH, Updated On : June 17, 2021 12:34 pm
Follow us on

కరోనా, ఇతర కారణాలతో ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు ఆదాయం పెంచుకునే పనిలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు  భూములను అమ్మేందుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని భూములకు వేలం నిర్వహించేందుకు టెండర్లను జారీ చేసింది. అయితే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల మార్కెట్ వ్యాల్యూను కూడా పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా రియల్ ఎస్టేట్ దందాలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో ఉంది.

హైదరాబాద్ శివారులోని కోకాపేట్, ఖానామేట్లోని 64 ఎకరాల ప్రభుత్వ భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్మాకానికి పెట్టింది. ఈ భూముల అమ్మకం ద్వారా 16 వందల కోట్ల రూపాయల రాబడిని ఆర్జించేందుకు రెడీ అయింది. అయితే భూముల అమ్మకంతో పాటు ఇప్పుడున్న భూముల మార్కెట్ వ్యాల్యూ పెంచడం ద్వారా కూడా అధిక ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది.

అయితే ఈ భూములు మార్కెట్ విలువ పెంచి ఆదాయం సమకూర్చుకునేందుకు త్వరలో అడిషినల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఓ కమిటీ వేయనుంది. ఇందులో జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ పరిధిలో అయితే హెచ్ఎండీఏ కమిషన్ సభ్యుడిగా ఉంటారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములతో పాటు హైవే పక్కనున్న భూములు, కమర్షియల్ బిట్స్ ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించనున్నారు.

ఈ మార్కెట్ వాల్యూ గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం, వ్యవసాయ భూములపై 20 శాతం పెరగనున్నట్లు సమాచారం. అలాగే వ్యవసాయేతర భూములపై 40 నుంచి 50 శాతం మార్కెట్ వ్యాల్యూ పెంచాలని సర్కార్ యోచిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు రియల్ ఎస్టేట్ దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం భూమి మార్కెట్ వ్యాల్యూకు, రియల్ ఎస్టేట్ ధరకు చాలా తేడా ఉంది. దీంతో అక్రమ దందాకు తెర లేస్తుందని భావిస్తున్నారు.