Lalit Modi : అక్కడ కంపెనీని ఏర్పాటు చేసుకొని విదేశాలలో ఉంటూ ఆదాయాన్ని సంపాదించుకున్నప్పటికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కార్పొరేట్ పండు ఉండదు. గిఫ్ట్ టాక్స్ అవసరంలేదు. ఎస్టేట్ టాక్స్ చెల్లించాల్సిన ఇబ్బంది లేదు. క్రిప్టో హబ్ గా ఉన్న వనవాటు.. హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో తొలి స్థానంలో ఉండడం విశేషం. వనవాటు దేశంలో పన్నులు.. నిబంధనలు పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు. అందువల్లే లలిత్ మోడీ ఈ దేశాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.. ఇతర దేశాల నుంచి సంపదను తీసుకురావడానికి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండవు. అందువల్ల దీనిని టాక్స్ హెవెన్ కంట్రీ అని పిలుస్తుంటారు. వనవాటు గోల్డెన్ వీసా ప్రోగ్రాం నిర్వహిస్తుంది. డాన్ ప్రకారం ఆ దేశానికి ఎవరైనా భారీగా పెట్టుబడులు తీసుకొస్తే పౌరసత్వం ఇచ్చి గౌరవిస్తుంది. అక్రమాలకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ వనవాటు దేశంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. మరవైపు ఈ దేశానికి భారతదేశంతో నేరస్తుల అప్పగింతపై ఎటువంటి ఒప్పందం కూడా లేదు. అందువల్లే లలిత్ మోడీ ఈ దేశాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. ఇప్పుడు ఎలాగూ లలిత్ మోడీ భారత పౌరసత్వం రద్దయింది కాబట్టి.. అతడు ఏకంగా భారతీయుడు కాకుండా పోయాడు. అందువల్ల అతడిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి. లలిత మోడీ వనవాటు పాస్పోర్ట్ నెంబర్ RV0191750.. దాని ప్రకారం.. పూర్తి పేరుగా లలిత్ కుమార్ మోడీ అని.. అతడు పుట్టింది న్యూఢిల్లీ అని ఉంది. పుట్టిన తేదీ 1963 నవంబర్ 29గా నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 30న ఆయనకు పాస్పోర్ట్ జారీ చేశారు. పాస్పోర్ట్ వయసు రెండు నెలలు మాత్రమే ఉండడం విశేషం.
Also Read : లలిత్ మోడీ ఇక జన్మలో ఇండియాకు రాడు.. ఆ దేశం పౌరసత్వం ఇచ్చింది.. అక్కడి ప్రత్యేకతలు ఏంటంటే..
అతని అడుగుజాడల్లో
లలిత్ మోడీ మోహుల్ చోక్ సీ అనే ఆర్థిక నేరగాడి అడుగుజాడల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. 2017లో చొక్సి అంటిగ్వా అండ్ బార్బుడ దేశ పౌరసత్వాన్ని పొందాడు. అందువల్లే అతడిని మన దేశానికి తిరిగి రప్పించలేకపోతున్నారు. ఇక లలిత్ మోడీ కూడా అదే వివాహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. వనవాటు దేశ పౌరసత్వంతో.. భారత పాస్పోర్ట్ ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. ఫలితంగా అతడిని విచారించడానికి భారతదేశానికి చట్టపరంగా ఎటువంటి అవకాశాలు ఉండవు. అయితే విదేశీ పౌరసత్వం తీసుకున్నప్పటికీ భారతదేశానికి విచారించడానికి అవకాశాలు లేకుండా పోవు. లలిత్ మోడీని వెనక్కి తీసుకురావడానికి భారత్ అనేక ప్రక్రియలు చేపట్టవచ్చు. దౌత్యపరంగా ఒకటి తీసుకురావచ్చు. ఇంటర్ పోల్ ద్వారా లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని అడగవచ్చు. మనీలాండరింగ్ నిరోధక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని వనవాటు ప్రభుత్వాన్ని భారత్ కోరవచ్చు. కాకపోతే ఈ విధానాలను భారత్ అత్యంత వ్యూహాత్మకంగా కొనసాగించాలి. అప్పుడే ఏదో ఒక రోజు లలిత్ మోడీ మనదేశానికి తిరిగి వస్తాడు. అప్పటిదాకా అతడు వనవాటు పౌరుడిగా అక్కడే ఉంటాడు
Also Read : ఐపీఎల్ లో కొచ్చి ఫ్రాంచైజీ వెనక అంత కథ నడిచింది.. 10 జన్ పథ్ నుంచి ఒత్తిడి వచ్చింది.. లలిత్ మోడీ సంచలనం