Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాసులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇతరుల ప్రయోజనాల కోసం కాకుండా సొంత వారి అవసరాల కోసం కష్టపడాలి. కార్యాలయాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. వీటికి అనుగుణంగా పనిచేయాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న పని కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. పిల్లల కెరీర్ పై దృష్టి పెడతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే అనుకునే సమయం. బంధువుల్లో ఒకరి నుంచి దన సహాయం అందుతుంది. స్నేహితులారా సహాయంతో కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా వారు శుభవార్తలు వింటారు. అయితే దూర ప్రయాణాలు చేయాలని అనుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిరిగి చెల్లించడానికి తీవ్ర కష్టమవుతుంది. అనవసరపు ఖర్చులు పెరగడం వల్ల మానసికంగా ఆందోళనలతో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారంలో ఇబ్బందులు పడతారు. సోదరీ వివాహం కోసం బిజీగా మారతారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తెలివితేటలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. పెద్ద మొత్తంలో డబ్బులు అందుకుంటారు. వీటితో భారీ ప్రాజెక్టులను చేపడతారు. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారు రాజకీయ నాయకులు అయితే వీరికి ఈ రోజు అనుకున్న వారిని వాతావరణం ఉంటుంది. విద్యార్థుల పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. విద్యార్థులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పెళ్లి సమస్యలను పూర్తి చేస్తారు. మానసికంగా ఆందోళనలతో ఉంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన ఇబ్బందులు గురవుతారు. ఉద్యోగులు అదన పాదాలను పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొన్ని వాగ్వాదాల్లో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కుటుంబంతో గొడవలు ఉన్నప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. సాయంత్రం జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. మాటలను అదుపులో ఉంచుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. అయినా అదనపు ఆదాయం వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పనులు పూర్తి కాకపోవడంతో మానసికంగా ఆనందమయంతో ఉంటారు. ఉద్యోగులు తోటి వారి సహకారంతో కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. బంధువుల్లో ఒకరి నుంచి ధన సహాయం పొందుతారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారులు కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లలతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు పెద్దవిగా కాకుండా ఉంటాయి. పిల్లల భవిష్యత్తుపై స్ కీలక నిర్ణయం తీసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల్లో ఒకరి నుంచి రుణం పొందుతారు. కొత్త వ్యక్తులతో డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.