JD Lakshmi Narayana: చదువు రాక ముందు కాకరకాయ అని చదువుకున్నాక కీకర కాయ అన్నాట్ట. బహుతెలిసిన వాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు అనేది కూడా సామెతే. ఆంధ్రప్రదేశ్ లో జేడీ లక్ష్మినారాయణకు అంత పేరు ఉంది. మామూలు లక్ష్మినారాయణ అంటే ఎవరికి తెలియదు జేడీ లక్ష్మినారాయణ అంటేనే అందరికి తెలుస్తుంది. అంతటి ఘనత సంపాదించుకున్న లక్ష్మినారాయణకు కూడా కుల పిచ్చి పట్టుకోవడం ఆశ్చర్యకరం. ఆయన జేడీగా రాజీనామా చేసి జనసేనలో చేరినా ఆయనకు జనం మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి పాలయినా నైతికంగా మాత్రం గెలిచారు. అంటే ఆయన ఎప్పుడు కూడా కుల, మతాలకు అతీతంగా ఉండేవారు. దీంతో ఆయనను అందరు అభిమానించారు.ఆయన నిజాయితీని ప్రశంసించారు.
ఏపీలో జగన్ కేసులు డీల్ చేయడంలో కూడా ఆయనకు మంచి పేరుంది. అలాంటి గొప్ప విజయాలు సాధించిన ఆయన ఇటీవల కుల సమావేశాలకు హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ అధికారిగా రాష్ర్టంలో సుపరిచితుడైన లక్ష్మినారాయణ అప్పట్లో కొత్త పార్టీ పెడతారని భావించారు. కానీ ఆయన జనసేనలో చేరారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా ఎక్కువ ఓట్లు సాధించడం విశేషం.
Also Read: జీవితం నాశనం కాకూడదు అంటే ఈ ముగ్గురు వ్యక్తులను దూరం పెట్టాలి.. చాణిక్య నీతి!
ఇటీవల కాపు సామాజిక వర్గ సమావేశాలకు ఆయన హాజరు కావడంతో ఆయనకు కూడా కుల ముద్ర పడింది. ఇన్నాళ్లు బాగా చదువుకున్న వ్యక్తి అన్ని తెలిసిన వారు అనుకున్నా కుల సమావేశానికి హాజరు కావడంతో ఆయన మీద ఉన్న గౌరవం పోయింది. ఆయన కూడా సాధారణ వ్యక్తిగానే పరిగణించబడుతున్నారు. అంటే కుల పిచ్చి అంత దారుణంగా ఉంటుందని ఆయనకు తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కుల సమావేశానికి హాజరై పరువు తీసుకున్నారు. ఒక కులానికి పరిమితమైన నేతగా ముద్రపడిపోయారు. రాజకీయాలకతీతంగా ఆలోచించే ఆయన కుల సమావేశానికి ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఆయన తప్పటడుగు వేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీ ఆలోచన ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. రాజకీయాల్లో కుల పిచ్చి అంటుకుంటే ఇక అంతే సంగతి. కులానికి పరిమితమై పోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రుణ లక్ష్యం భారీగా పెంచుతూ?