Lakshmi Parvathi: హెల్త్ యూనివర్సిటీకి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును తొలగించిన సీఎం జగన్ తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. దీంతో ఇది పెను వివాదమైంది. సీఎంగా చేసిన రోజులు, అనుభవం, ఇతర పాలనతో చూస్తే వైఎస్ఆర్ కంటే ఎన్టీఆర్ ముందున్నారు. కానీ తండ్రి కావడం.. ఆవాజ్య ప్రేమతో జగన్ చేసిన ఈ పని వివాదాస్పదమైంది.

హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ భగ్గుమన్నది. చంద్రబాబు అయితే తీవ్రంగా ఖండించి ఎన్టీఆర్ పోలిస్తే వైఎస్ చరిష్మా , పాలన అనుభవం ఎంత అంటూ ఆక్షేపించారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ‘క్రిస్టియన్’ కాలేజీలు, మిషనరీల పేర్లు కూడా మార్చాలని.. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి పేరు తీసేయడం శోచనీయమని జగన్ ను కడిగేశారు.
Also Read: YS Sharmila: అన్నా ఇది తగునా.. జగన్ సర్కార్‌ను తప్పుపట్టిన షర్మిల!
ఈ వివాదంలో సీనియర్ ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ చైర్మన్ అయిన లక్ష్మీపార్వతి ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపింది. ఎందుకంటే ఆమెకు జగన్ అంటే పంచప్రాణాలు. ఆయనపై ఈగ వాలనీయకుండా చంద్రబాబును కడిగేస్తుంది. జగన్ కు సపోర్టుగా నిలుస్తుంది. కానీ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఇంతవరకూ లక్ష్మీపార్వతి స్పందించలేదు.కానీ సడెన్ గా షాకిచ్చింది.

ఎన్టీఆర్ పేరు మార్చడంపై రగిలిపోతున్న లక్ష్మీపార్వతి అటు జగన్ ను ఏమీ అనలేక.. ఇటు జగన్ నిర్ణయాన్ని సమర్థించలేక.. మీడియాకు ముఖం చూపలేక జగన్ ఇచ్చిన తెలుగు అకాడమీ చైర్మన్ పదవికి లక్ష్మీపార్వతి రాజీనామా చేసినట్టు సమాచారం. ఇలా ఇన్నాళ్లు జగన్ ను కాపుకాసిన లక్ష్మీపార్వతి ఈ ఒక్క నిర్ణయంతో ఆయనకు దూరంగా జరగడం.. రాజీనామా చేయడం సంచలనమైంది. త్వరలోనే ఆమె తన రాజీనామాను అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: ఎన్టీఆర్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్…జగన్ కు దిమ్మతిరిగే స్టెప్