Pawan Kalyan- Gymkhana Ground Stampede: భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మూడో మ్యాచ్ కు హైదరాబాద్ వేదికైంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాలను హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో పెట్టారు. దీనికి యువకులు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టికెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొంతమంది సృహతప్పి పడిపోయారు. ఈ ఘటనలో 20 మందికి పైగా క్రీడాభిమానులు.. 10 మంది పోలీసులు గాయపడ్డారు. ఒకరు మరణించినట్టు వార్తలు వచ్చాయి.

జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ సమస్యలపై, జగన్ ను టార్గెట్ చేయడంలో సూటిగా, నిగ్గదీసే అడిగే పవన్ కళ్యాణ్.. తెలంగాణలోని జింఖానా తొక్కిసలాటపై మాత్రం యాంటిమెంట్ పూసిన చందంగా సుతిమెత్తగానే ప్రశ్నించారు. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం తప్పు పెద్దగా లేకపోవడం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే కావడంతో కేసీఆర్ సర్కార్ జోలికి పవన్ పోలేదు.

హెచ్.సీఏ అవినీతి, ప్రభుత్వానికి చెప్పకుండా టికెట్లు అమ్మడం వల్ల ఈ తొక్కిసలాట ఏర్పడింది. పారదర్శకంగా విక్రయాలు చేపట్టకపోవడంతో తొక్కిసలాట ఏర్పడింది.అందుకే పవన్ కళ్యాణ్ దీనిపై సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

‘లాఠీచార్జిలో గాయపడ్డ 20 మంది అభిమానులు, 10 మంది పోలీసులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఆసక్తిని అంచనావేసి పకడ్బందీ ఏర్పాట్లు చేసి పారదర్శకంగా విక్రయాలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు.. ఈఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి’ అని పవన్ డిమాండ్ చేశారు. తెలంగాణలోని సమస్యలను కూడా ఎలుగెత్తి చాటుతూ బాధితుల పక్షాన పవన్ నిలబడుతున్నారు.