Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR: చంద్రబాబు కు షాక్ .... టీడీపీ పగ్గాలు జూ ఎన్టీఆర్ చేతికి

Junior NTR: చంద్రబాబు కు షాక్ …. టీడీపీ పగ్గాలు జూ ఎన్టీఆర్ చేతికి

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్..తెలుగు సినిమా రంగంలో దూసుకుపోతున్న యువ కథనాయకుడు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనుమడు. చైతన్య రథసారధి నందమూరి హరికృష్ణ ముద్దుల తనయుడు. సీనియర్ ఎన్టీఆర్ కు మరో రూపురేఖాలు పుణికి పుచ్చుకున్న వాడిగా అభిమానులు భావిస్తుంటారు. తనకంటూ ప్రత్యేక నటన, వాక్చాతుర్యం, ప్రత్యేక మేనరిజమ్ తో తెలుగు సినిమా నాట దూసుకుపోతున్నారు. అయితే ఆయన రాజకీయ అరంగేట్రంపై ఎప్పటి నుంచో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మాత్రం ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇలా డిమాండ్ చేస్తున్న వారిలో ఎక్కువగా విపక్ష పార్టీల వారే కావడం గమనార్హం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటు టీడీపీలో కూడాయాక్టివ్ గా లేరు. లోకేష్ ను ఫోకస్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారన్న ప్రాచరమైతే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగావైసీపీ నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఇదే డిమాండ్ చేశారు. తాత స్థాపించిన టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలన్నదే తన అభిమతమన్నారు. అతడికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు. అయితే ఆమె గతం నుంచి ఇదే మాటను చెప్పుకొస్తున్నారు. కానీ ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆమె విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు. రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆకాంక్షించారు. దానికి సంతోషపడిన వారిలో ముందు వరుసలో ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. అయితే గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆమె తెలుగుదేశం రాజకీయాలపై స్పందించడం, ఎన్టీఆర్ మనుమడిగా పార్టీని టేకోవర్ చేసుకోవాలని సూచించడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి.

Junior NTR
chandrababu- Junior NTR

ఆ భేటీతో..
ఇటీవల తెలంగాణలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. మునుగోడు సభకు హాజరైన ఆయన తిరుగు పయనంలో హైదరాబాద్ లో కొందరు ప్రముఖులను కలుసుకున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన అమిత్ షాను హైదరాబాద్ లోని నోవాటల్ హోటల్ లో కలిశారు. సుమారు అర గంట పాటు ఏకాంతంగా చర్చించారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై రకరకాల కథనాలు నడిచాయి. బీజేపీ స్టార్ కేంపెయినర్ గా జూనియర్ ఎన్టీఆర్ సేవలు వినియోగించుకుంటుందని ప్రచారం సాగింది. ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారని కూడా టాక్ నడిచింది. మరోవైపు తెలంగాణలో షటిలర్స్ ఓట్ల కోసమే అమిత్ షా ఆయన్ను కలిశారని కూడా వ్యాఖ్యలు వినిపించాయి. కమ్మ సామాజికవర్గం సపోర్టు కోసమేనని కూడా ప్రచారం జోరుగా సాగింది. కానీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా మాత్రం అబ్బెబ్బే ఆ భేటీ రాజకీయం కోసం కాదు. ఆర్ఆర్ఆర్ మూవీలో అద్బుతంగా నటించినందునే జూనియర్ ఎన్టీఆర్ ను అభినందించడానికి అమిత్ షా పిలిచారని కూడా కథనాలు వండి వార్చింది. అటు ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని కూడా స్పందించారు. బీజేపీ పెద్దలు ఏ రాజకీయ ప్రయోజనం లేనిదే ఎవర్నీ కలవరని.. చంద్రబాబు, లోకేష్ లతో పని జరగనందునే జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి మాట్లాడరని కొత్త పల్లవి అందుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర ఉదంతం మాదిరిగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రయోగించి టీడీపీని హస్తగతం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తందన్న ప్రచారం నడిచింది. ఇప్పడు తాజాగా లక్షీపార్వతి స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్..
ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైసీపీ నాయకురాలిగా ఉన్నారు. ఆది నుంచి ఆమె చంద్రబాబును విభేదిస్తూ వచ్చారు. అటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా ఆమెను అవాయిడ్ చేసిన సందర్భాలున్నాయి. అదే సమయంలో చంద్రబాబును విభేదించి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ బాట పట్టారు. తరువాత పురందేశ్వరి బీజేపీ వైపు వెళ్లగా..వెంకటేశ్వరరావు వైసీపీ వైపు వెళ్లారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల వారు చంద్రబాబు పట్ల సానుకూలంగా స్పందించిన సందర్భాలున్నాయి. వారి మధ్య స్నేహం చిగురించిందన్న వార్తలు వచ్చాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాను కలిసే ముందు తన మేనత్త పురందేశ్వరితో చర్చించారని కూడా ప్రచారం నడిచింది. అమిత్ షా భేటీ తరువాత ఈ అనుమానాలు తలెత్తే అవకాశముందని జూనియర్ ఎన్టీఆర్ కు తెలుసు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశాడా? లేకుంటే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి చర్చకు తెరలేపారా? అన్న అనుమానాలైతే ఉన్నాయి. అయితే వారి మధ్య భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా? లేకుంటే ఏకాంతంగా చర్చలు ఎందుకు జరిపినట్టు అన్నది మాత్రం బయటకు రావడం లేదు. అటు బీజేపీ మాత్రం భేటీని లైట్ తీసుకుంటుండగా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇవేవీ బయటకు వెల్లడించడం లేదు. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు అంటే గిట్టని కొడాలి నాని, లక్ష్మీపార్వతిలు స్పందించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

Junior NTR
chandrababu – Junior NTR

లైట్ తీసుకుంటున్న టీడీపీ..
అయితే ఈ పరిణామ క్రమాలను టీడీపీ చూస్తూ ఊరుకుంటోంది. నేతలు ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాతో కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందులో రాజకీయాలు ఏమిటీ లేవని లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉందని నమ్ముతున్నారు. పైగా ఈనాడు సంస్థల అధినేత చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి దిగారని.. అమిత్ షాతో భేటీ అయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అన్నిటికంటే మించి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే చంద్రబాబు అవసరం బీజేపీకి ఉందని గుర్తుచేస్తున్నారు. అక్కడ షటిలర్స్ చంద్రబాబు అంటే అభిమానమని.. అందుకే బీజేపీ విషయాన్ని గుర్తించి స్నేహ హస్తం అందించిందని భావిస్తున్నారు. చంద్రబాబు లైమ్ లైట్ లో ఉన్నంతవరకూ టీడీపీకి నాయకత్వ లోటు ఉండదని.. ఆయన తదనంతరం అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు సమర్ధుడైతే వారిని పార్టీ వర్గాలు పట్టం కడతాయని చెబుతున్నారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ శ్రేణుల నుంచి ఎటువంటి కామెంట్స్ రావడం లేదు. కానీ విపక్షంలో ఉన్న ఆయన సన్నిహితులు మాత్రం పార్టీ పగ్గాలు తీసుకోవాలని సూచిస్తుండడం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular