
మన దగ్గర శృంగారం గురించి మాట్లాడడమే తప్పు. పురుషులకు స్వాతంత్రం ఎక్కువే ఉన్నా.. స్త్రీలు మాట్లాడడం మాత్రం ఇంకా చాలా పెద్ద తప్పు. తప్పే కాదు.. పాపం కూడా! ఇలాంటి ఆలోచనలతో, కట్టుబాట్లతో స్త్రీకి బంధనాలు వేస్తుంటారు. సమాజం విధించిన ఈ రూల్ ను అతిక్రమించిన వారిని నీచంగా చూస్తుంటారు. దీనికి బయపడే.. మహిళలెవరూ సెక్స్ గురించి బయటకు మాట్లాడరు.
కానీ.. ఇదొక సహజమైన విషయం. మనిషి దేహానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనవి భోజనం, నిద్ర. ఆ తర్వాత మూడోది సెక్స్. నిజానికి ఇది కూడా ఒక ఆకలి. మనసు, శరీరం కలిసి తీర్చుకునే ఆకలి. ఈ భూమ్మీదున్న ప్రతీ జీవరాసుల విషయంలోనూ ఇది కామన్. ఏ జంతువుకూ అడ్డంకులు, కట్టుబాట్లు లేవు. కేవలం మనిషికి మాత్రమే ఈ పరిస్థితి. నూటికి 90 శాతం మంది సమాజం ఏమనుకుంటుందోనని కోరికలను అణచుకొనో, చంపుకొనో బతికేస్తుంటారు. మరికొందరు మాత్రం ఆ బౌండరీని దాటేస్తారు. అయితే.. సెక్స్ విషయంలో మహిళల ఆలోచన ఎలా ఉంటుంది? మగాళ్లను ఏ కారణాలతో కోరుకుంటారు? ఎలాంటి వారిని సెలక్ట్ చేసుకుంటారు? అనే విషయమై ఇంట్రస్టింగ్ విషయాలు తెలిశాయి.
ఆస్ట్రేలియాలోని మక్వైరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయమై అధ్యయనం చేశారు. ఓపెన్ లేదా క్యాజువల్ సెక్స్ మహిళలు ఎలాంటి వారిని సెలక్ట్ చేసుకుంటారు? ఏం చూసి సెలక్ట్ చేసుకుంటారు? అన్నప్పుడు.. కేవలం వారి ముఖం చూసి ఎంచుకుంటారట. అంతేకాదు.. మగాళ్ల ముఖం చూసి వాళ్లు సెక్స్ కు రెడీగా ఉన్నారో.. లేదో.. అని ఇట్టే చెప్పేస్తారట లేడీస్! ఇక, మహిళల సైకాలజీ ప్రకారం.. ఆరోగ్యంగా, ఫిట్ కనిపించే మగాళ్లనే సెక్స్ కోసం ఎంచుకుంటారట. ఇక, అన్నిటికన్నా.. మగాళ్ల ముఖం అందంగా ఉన్నవారికే ప్రయారిటీ ఇచ్చేస్తారట.
మొత్తం 103 మందిపై ఆస్ట్రేలియాలోని మక్వైరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయమై రీసెర్చ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరు ఉన్నారు. తాత్కాలికమైన రిలేషన్, క్యాజువల్ సెక్స్ గురించి ప్రశ్నించినప్పుడు పై విధంగా మహిళలు స్పందించారు. అయితే.. క్యాజువల్ సెక్స్ కోసం మగాళ్ల ఫేస్ చూసి సెలక్ట్ చేసుకుంటామని లేడీస్ చెప్పగా.. పురుషులు మాత్రం ఫేస్ చూసి మాత్రమే ఎంచుకుంటామని చెప్పకపోవడం గమనార్హం.
ఇక, ఇందులోనూ ఎక్కువ మంది ఆడవాళ్లు ఏం చెప్పారంటే.. పొడవైన ముఖం ఉన్నవాళ్లు, విశాలమైన నుదురు, పొడవాటి ముక్కు, పెద్ద పెద్ద కళ్లు ఉండే మగాళ్లు క్యాజువల్ సెక్స్ కు రెడీగా ఉంటారని చెప్పారు. చిత్రంగా.. ఇలాంటి పోలికలు కలిగిన మగాళ్లను ఆ రీసెర్చ్ బృందం క్యాజువల్ సెక్స్ కు సిద్ధమేనా అని ప్రశ్నించగా.. వారు రెడీ అని చెప్పడం విశేషం. ఆ విధంగా.. కేవలం మగాళ్ల ముఖం చూసి వారు ఓపెన్ సెక్స్ కు సిద్ధంగా ఉంటారా? లేదా? అని మెజారిటీ ఆడవాళ్లు చెప్పేస్తారట! అందుకే.. సముద్రం లోతు, మహిళ మనసును అంచనా వేయడం అసాధ్యమని చెబుతుంటారు. నిజమేనంటారా?