
నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘ఆదిత్య 369’. రెండు పాత్రల్లో కనిపించిన బాలకృష్ణ ఇందులో అద్భుతంగా నటించాడు. కొన్ని సంవత్సరాలు వెనుకకు.. మరికొన్ని సంవత్సరాలు ముందుకు వెళితే ప్రపంచం ఎలాగుంటుందో ఈ సినిమా చెబుతుంది. 30 ఏళ్ల కిందటే టెక్నాలజీని ఉపయోగించుకొని తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. 101 రోజుల్లో నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూద్దాం..
‘ఆదిత్య 369.. సినిమా వచ్చి 30 ఏళ్లవుతుందా.. అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ సినిమాలో నన్ను నేను చూసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికీ ఈ సినిమా సోషల్ మీడియాలో ఆదరణ పొందుతుండడం గర్వంగా ఉంది. ఇక ప్రపంచ సినీ చరిత్రలో సోషియో ఫాంటసీ, చరిత్ర, సైన్స్.. ఈ మూడు కలిసి వచ్చిన అతికొద్ది సినిమాల్లో ఆదిత్య 369 నిలుస్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు, నిర్మాతలుగా ఉన్న స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణ ప్రసాద్ ల గారికి నా అభిమానులకు కృతజ్జతగా ఉంటాను’ అని అన్నారు.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ యువకుడిగా, శ్రీకృష్ణ దేవరాయులు పాత్రలో నటించారు. వాస్తవానికి శ్రీకృష్ణ దేవరాయులు, ఆయన సామ్రాజ్యం గురించి ఈ సినిమా ద్వారానే చాలా మందికి తెలిసింది. ఇక ప్రపంచం ముందకు వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా చూపించడం అద్భుతమైన ఘట్టం. 2050 సంవత్సరంలో ప్రపంచం రోబోటిక్ గా ఎలా మారుతుందని అద్భుతంగా చూపించారు.
ఇక సాంగ్స్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించారు. సిల్క్ స్మిత, అమ్రిష్ పురి, సుత్తివేలు, తరుణ్ నటించారు. ఆ రోజుల్లోనే సినిమాకు రూ.కోటిన్నర ఖర్చు చేశారు. సినిమా వచ్చి 30 ఏళ్లు అవతున్న సందర్భంగా సినీ నటులందరికి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో కూడా సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రకరకాల పోస్టులు పెడుతున్నారు.