KVP Ramachandra Rao- Pawan Kalyan: కేవీపీ రామచంద్రరరావు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. దివంగత వైఎస్సార్ ఆత్మగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు. రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. కనీసం మీడియాలో సైతం కనిపించడం లేదు. అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి జనసేనాని పవన్ కల్యాణ్ పై రియాక్ట్ అయ్యారు. ఆయన పొత్తుల ప్రకటనలపై ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదన్నారు. ఏపీకి పాచిపోయిన లడ్డూ ఇచ్చిన బీజేపీతోనే జత కట్టారని గుర్తుచేశారు. మళ్లీ వామపక్షాలతో కలుస్తారేమోనని సెటైర్ వేశారు. అంతటితో ఆగకుండా పవన్ను విమర్శించే స్థాయి తనది కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉన్నట్టుండి కేవీపీ ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేగుతోంది. సాధారణంగా ఆయన ఎవరిపై కామెంట్ చేయరు. ఇటీవల అసలు మీడియాకే దొరకడం లేదు. అటువంటి వ్యక్తి కావాలనే పవన్ పై, ఆయన పొత్తుల ప్రయత్నాలపై వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కు కేవీపీ ఏదో హింట్ ఇవ్వబోయారన్న చర్చ అయితే జరుగుతోంది. ప్రత్యేకంగా పాచిపోయిన లడ్డూ అని సంబోధించడం ద్వారా బీజేపీతో కలిసి నడవొద్దని సలహా ఇస్తున్నట్టు అర్ధమవుతోంది.

కొద్దిరోజులుగా సైలెంట్..
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేవీపీ రాజ్యసభ పదవీకాలం కొద్దిరోజుల కిందటే ముగిసింది. ఆయనకు రెన్యూవల్ లభించలేదు. జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నా.. ఏనాడూ వైసీపీ వైపు చూడలేదు. జగన్ కూడా కేవీపీ సాయాన్ని అర్ధించలేదు. అప్పటి నుంచి వారి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. ఇటీవల అది ఎక్కువైందని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. కేవీపీ కేవలం ఢిల్లీకే పరిమితమయ్యారు. అడపాదడపా కాంగ్రెస్ కేంద్ర నాయకులతో కనిపిస్తుంటారు.
Also Read: Janasena-BJP TDP: జనసేన-బీజేపీ పొత్తుల రాగం.. టీడీపీ మౌనం వెనుక కథేంటి?
ఆయనకు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. నాయకులందరూ టచ్ లో ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు సలహా ఇవ్వబోయి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. పవన్ ఒంటరిగా వెళ్లడమో.. లేకుంటే టీడీపీతో కలిసి నడవడమో మేలన్న భావన కేవీపీలో ఉంది. బీజేపీతో మాత్రం కటీఫ్ చెబితేనే మేలన్నదే కేవీపీ వ్యాఖ్యల సారాంశమని ఆయన అనుచరులు చెబుతున్నారు.

రాజకీయ చాణుక్యుడు
సమకాలీన రాజకీయాంశాలపై కేవీపీ రామచంద్రరావుకు మంచి పట్టు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక కేవీపీ పాత్ర ఉంది. వైఎస్ ఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయన పాదయాత్రను సైతం తెర వెనుక నడిపించారు. 2004 ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో రాజకీయ పునరేకీకరణ చేసిన ఘనత కేవీపీదే. తెర ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నా.. తెరవెనుక మంత్రాంగం రామచంద్రరావుదే. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ, అటు రాయలసీమ, తెలంగాణాలో జిల్లాల వారీగా నాయకత్వం ఎంపిక, అభ్యర్థుల ఖరారు వంటి వాటని కేవీపీయే చూసుకున్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కుటుంబసభ్యలు కంటే కేవీపీ అండదండలే ఎక్కువ. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత కేవీపీకి ప్రభుత్వంతో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పించారు. వెఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి అధికారంలోకి రావడానికి కేవీపీ క్రుషి ఉంది. అటువంటి వ్యక్తి జనసేనకు సలహా ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకుంటే జనసేనకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశముంది. మరి జనసేనాని ఏం చేస్తారో…
Also Read:Daksha Nagarkar: దక్ష నగార్కర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరంతే!