Munugode Bypoll 2022: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్ మునుగోడు ఉప ఎన్నిక. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మునుగోడు జపమే చేస్తున్నాయి. చివరకు కేఏ.పాల్ కూడా ఈసారి తన పుట్టిన రోజును మునుగోడులోనే జరుపుకోవాలి నిర్ణయించారు. చిన్న, పెద్ద.. బలం, బలగంతో సబంధం లేకుండా ఇలా అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడుపైనే దృష్టిపెట్టాయి. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం నిర్వహిస్తుండగా అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి లేకుండా కేవలం మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో ఉప ఎన్నికకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కేసీఆర్ సమీక్షించారు. దిశానిర్దేశం చేశారు. కీలక అంశాలను వెల్లడించారు. టికెట్‌పై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

షెడ్యూల్.. ఎన్నికపై సీఎం అంచనా
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చి.. పార్టీ శ్రేణులకు ఉప ఎన్నిక ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్నల్లగొండ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు.
పార్టీ శ్రేణులు ఐక్యంగా, నాయకులు వ్యక్తిగత రాగద్వేషాలు వదిలి టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక చండూరులో సభ నిర్వహిద్దామని తెలిపారు. అమిత్‌షా చెప్పినట్లే.. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూలు అక్టోబరులో రావొచ్చని చెప్పారు. నవంబరులో ఎన్నిక జరగవచ్చని అంచనా వేశారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా నేతలంతా సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అభ్యర్ధిపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, సమావేశానికి జిల్లా మంత్రి.. ఎమ్మెల్యేలతోపాటుగా టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మాత్రమే ఆహ్వానించడం గమనార్హం.
Also Read: Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా…?
‘కూనుకుంట్ల’కే ఛాన్స్?
ముఖ్యమంత్రి సమీక్షలో ప్రస్తావించిన అంశాలు.. సమీకరణాలతో పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉందనే అంచనాకు పార్టీ నేతలు వచ్చారు. అయితే,షెడ్యూల్ వచ్చిన తరువాతనే అధికారికంగా పార్టీ అభ్యర్ధిని ప్రకటించనున్నారు. ఇదే సమయంలో మునుగోడులో సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి నేతలతో పంచుకున్నారు. అన్నీ సర్వేల్లో టీఆర్‌ఎస్ తొలి స్థానంలో ఉందని.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండగా, బీజేపీ మూడో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. మునుగోడులో నివాసం ఉంటున్న గిరిజనులను రోజుకో వెయ్యి మందిని హైదరాబాద్ తీసుకొచ్చి కొత్తగా నిర్మించిన ఆత్మగౌరవ భవనాలను చూపించాలని సూచించారు.
వారంలో గిరిజన రిజర్వేషన్ జీవో
గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ వారం రోజుల్లో జీవో ఇవ్వనున్నామన్నారు. గిరిజన బంధునూ ప్రారంభించబోతున్నామన్నారు. వీటిపై గిరిజనుల ఇంటింటికీ తిరిగి గిరిజన బంధు, దళితబంధు గురించి ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ రెండు పథకాలకు మునుగోడులోనూ 500 మందిని ఎంపిక చేయాలని సూచించారు. ఎన్నిక కు ఇంకా సమయం ఉందని ఉదాసీనంగా ఉండొద్దన్నారు.

వద్దన్న అభ్యర్థికే ఎందుకు మొగ్గు..
రాజకీయ పార్టీలకు క్యాడరే కీలకం.. క్యాడర్ నిర్ణయాన్ని లెక్కచేయని పార్టీలు ఎన్నికల్లో దెబ్బతిన్న ఉదంతాలు అనేకం. అయితే మునుగోడు విషయంలో సీఎం కేసీఆర్ క్యాడర్ అభిప్రాయాన్ని లెక్కచేయడం లేదు. కేవలం ధన బలాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ దగ్గర, తాను ప్రకటించబోయే అభ్యర్థి దగ్గర ఎన్నికలను ఎదుర్కొనేంత సంపద ఉదంని, డబ్బులు పడేస్తే ఓట్లు అవే పడతాయనే భావనలో గులాబీ బాస్ ఉన్నారని మునుగోడు నేతలు పేర్కొంటున్నారు. అందుకే క్యాడర్‌నే కాదు కీలక నేతలైన బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్ అభిప్రాయాలకు కూడా కేసీఆర్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి. బూర నర్సయ్యగౌడ్ విషయంలో జిల్లా మంత్రి కూడా చులకనగా వ్యవహరిస్తున్న తీరు టీఆర్‌ఎస్ శ్రేణులకు నచ్చడం లేదు. ఎన్నికల ప్రచారానికి కానీ, సమావేశాలకు కానీ ఆయనను ఆహ్వానించకుండా దూరం పెడుతన్నారు. అసంతృప్తులను సముదాయించకుండా, క్యాడర్‌ను లెక్కచేయకుండా సీఎం కేసీఆర్ ప్రకటించే మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రకటిస్తే ధన బలం గెలుస్తుందో, క్యాడర్ గెలుస్తుందో చూద్దామని కొంతమంది గులాబీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
Recommended videos: