Jagan- Kuppam: పాలకులు చేసే అభివృద్ధిని ప్రజలు చెప్పుకోవాలి. కానీ ప్రజాప్రతినిధులు తాము ఇంత చేశాం,, అంత చేశాము.. ఇంకా చేస్తాము.. స్వరూపాన్నే మార్చేస్తామంటే అసలు పట్టించుకోరు. అందులో వాస్తవముంటే హర్షిస్తారు. ఆహ్వానిస్తారు. వాస్తవ విరుద్ధమైతే మాత్రం ఛీ కొడతారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ విపక్ష నేత కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాననని ముందుకొచ్చారు. అసలు చంద్రబాబు సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదని కూడా చెబుతున్నారు. కుప్పంను పులివెందుల తరహాలో అభివృద్ధి చేస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అన్నివిధాలా అభివృద్ధి చేశారని వీడియో ప్రదర్శనలు ఇచ్చి మరీ చెబుతున్నారు. సుందరమైన కుప్పం అంటూ అక్కడి రోడ్లు, ఇతరత్రా మౌలిక వసతులు, విద్య, వైద్యం, మెడికల్ కాలేజీ సేవలను గుర్తుచేస్తున్నారు. ఇవి కుప్పం ప్రజలను ఆలోచనలో నెట్టేస్తున్నాయి. కుప్పం, పులివెందుల నియోజకవర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తిస్తున్నారు.

కుప్పంను పారిశ్రామికంగా కూడా చంద్రబాబు తీర్చదిద్దారు. పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. బెంగళూరుకు రైలు, రోడ్డు రవాణాను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లేవారికి మార్గం సుగమం చేశారు. ఎలా చూసినా కుప్పం నియోజకవర్గప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి,. ఇందులో నో డౌట్. అదే సమయంలో పులివెందలలో ఆ పరిస్థి ఉందా అంటే? లేదనే సమాధానం వినిపిస్తోంది. కానీ చంద్రబాబు కుప్పంలో సాధించినదాని కంటే..పులివెందులలో వైఎస్ కుటుంబం ఎక్కువగా పట్టు సాధించింది. అధికారంలో ఉన్నా.. లేకున్నా ఆ కుటుంబానిదే అక్కడ పెత్తనం. కానీ ఆ స్థాయిలో పులివెందులలో అభివృద్ధి జరిగిందా అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి.
దశాబ్దాలకిందటే చంద్రబాబు కుప్పంలో బ్రహ్మాండమైన బస్టాండ్ ను కట్టించారు. మరి పులివెందులలో మాత్రం ఇప్పటికీ బస్టాండ్ లేదు. విమానం రూపంలో గ్రాఫిక్స్ తయారుచేసి ఆ నమూనాలో నిర్మిస్తామన్న సీఎం జగన్ మాటలకు అతీగతీ లేకుండా పోయింది. కుప్పం నియోజకవర్గంలో చాలా ఏళ్ల కిందటే మెడికల్ కాలేజీ నిర్మాణమైంది. అక్కడే వైద్య విద్యతో పాటు కుప్పంతో పాటు ఇతర నియోజకవర్గాల ప్రజలకు వైద్యసేవలందుతున్నాయి. పులివెందులలో ఇంకా మెడికల్ కాలేజీ నిర్మాణ దశలోనే ఉంది. కుప్పంలో ఇంజనీరింగ్ కాలేజీలు, ఆస్పత్రులు,. పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కానీ పులివెందులలో అటువంటి జాడలేదు. సీఎం జగన్ వందల కోట్ల రూపాయలకు సంబంధించి జీవోలు ఇచ్చారు. కానీ పనులు మాత్రం శూన్యం. అభివృద్ధి అంతా పేపర్లలోనే కనిపిస్తోంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పులివెందులలో అభివృద్ధి బాగానే జరిగింది. వందలాది కోట్లరూపాయలతో పనులు చేపట్టారు. కానీ అందులో కమీషన్లకే ఎక్కవగా వెళ్లిపోయాయన్న టాక్ నడిచింది. పనులైతే జరిగాయి కానీ అవన్నీ పాతబడిపోయాయి.,

అటు కుప్పంలో చంద్రబాబు, ఇటు పులివెందులలో వైఎస్ పట్టు సాధించారు. ప్రస్తుతం వైఎస్ వారసుడిగా జగన్ పులివెందులలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు అయినా చంద్రబాబు కుప్పంలో ఒక్క భవనం కట్టలేదు. మరి వైఎస్ కుటుంబం పులివెందుల నుంచి కుప్పం వరకూ ప్రతి 20 కిలోమీటర్లకు ఒక భవంతి చొప్పున నిర్మించుకుంది. ఇడుపాలపాయలో అయితే ఒక సామ్రాజ్యమే నిర్మించుకుంది. అంటే కుప్పంలో ప్రజలకు మేలు జరిగితే.. పులివెందులలో మాత్రం వైఎస్ కుటుంబం అభివృద్ధి చెందిదన్న మాట.