KTR- Amit Shah: నిన్నా మొన్నటిదాకా ఉప్పు, నిప్పులా ఉండే బిజెపి, బీఆర్ఎస్ ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో శుక్రవారం సమావేశం జరిగింది.. భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హస్తినలో సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. తన వెంట కొంతమంది అధికారులతో ఆయన దేశ రాజధానిలో అడుగుపెట్టారు. వాస్తవానికి కొంతకాలం నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం కొనసాగుతోంది. అమిత్ షా పలుమార్లు తెలంగాణకు వచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు గుర్తు తెలియని వ్యక్తితో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. సొంత పత్రికలో అడ్డగోలుగా వార్తా కథనాలు రాయించారు. ఇక నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. కొంతమంది బిజెపి నాయకుల పై కేసులు కూడా నమోదు చేశారు. ఇలా ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ అమిత్ షాను కలవడం తెలంగాణలో మాత్రమే కాదు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి కేటీఆర్ గతంలోను పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా.. వివిధ కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ అమిత్ షా తో భేటీ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఆయన ఇప్పుడు అమిత్ షాను కలవబోతున్నారు. నిన్నా మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భారత రాష్ట్ర సమితి నాయకులు కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి పై తమ పార్టీ వైఖరి పట్ల కొందరు బిజెపి రాష్ట్ర నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ అమిత్ షాను కలవడం ఒకింత ఆసక్తికరంగా మారింది.
కేంద్ర సహకారం కోరేందుకే
అయితే అమిత్ షాను కలవడం వెనుక రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే దాగి ఉన్నాయని భారత రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది..అది ఎలాగూ భారత రాష్ట్ర సమితి డబ్బా కాబట్టి దానిని నమ్మే పరిస్థితి ఉండదు. అయితే ఇద్దరి మధ్య రాజకీయ వ్యవహారాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలుమార్లు తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. ఏర్పాటు వల్ల కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరాలని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేశారని ధ్వజమెత్తారు. దీనికి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ శుక్ర, శనివారాల్లో అక్కడే ఉండి హోం మంత్రి తో పాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు చెప్పాయి. తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందడం లేదని, పెండింగ్లో ఉన్న వివిధ అంశాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే కేటీఆర్ ఢిల్లీలో పర్యటించబోతున్నారని ఆయన కార్యాలయ క్యాంపు వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాదులోని రసూల్ పూరా వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు హోం శాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కేటీఆర్ అమిత్ షా తో మాట్లాడతారని భారత రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో నిర్మించే స్కై వేల కోసం రక్షణ శాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారం గురించి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తులసి అడగనున్నారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన అంశంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి తో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది మంత్రులను కలిసి పలు సమస్యలను విన్నవించే అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా అడుగుతోందని, ఒకవేళ కేంద్రం స్పందించకుంటే క్షేత్రస్థాయిలో ఎండగడతామని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు.