Homeజాతీయ వార్తలుKTR: కేటీఆర్ లో అసహనం ఎందుకిలా పెరిగిపోతోంది?

KTR: కేటీఆర్ లో అసహనం ఎందుకిలా పెరిగిపోతోంది?

KTR: Why is impatience growing in KTR

KTR: రాజకీయాలు చేయడం అందరికి సాధ్యం కాదు. అందులో రాణించాలి, రాటు దేలాలి. ప్రత్యర్థిని తన మాటలతో ఇరుకున పెట్టాలి. కానీ వారి మాయలో పడిపోకూడదు. కానీ ఈ మధ్య నేతలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఎదుటివారి ఉద్దేశాలను గుర్తించకుండా పేలిపోయి ముఖం వాలేస్తున్నారు. తెలంగాణలో రెండు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేటీఆర్ నే లక్ష్యం చేసుకుని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో కేటీఆర్ కూడా అంతే వేగంగా స్పందిస్తున్నారు.

రేవంత్ రెడ్డి మాటలకు కేటీఆర్ తనదైన శైలిలో మాటలు తూటాల్లా పేలుస్తున్నారు. రేవంత్ రెడ్డిపై రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టాలని చెప్పడంతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యర్థి మాటలకు స్పందించాల్సిందే కానీ ఇంత తీవ్ర స్థాయిలో మాటలు మాట్టాడడంతో ఆయనలో సహనం కోల్పోతోందని తెలుస్తోంది. రాజకీయ నాయకులకు విమర్శలు సాధారణమే కానీ వాటిని సమర్థంగా తిప్పికొట్టే యుక్తుల్ని ఆలోచించాలి. కానీ కేటీఆర్ మాత్రం సహనం కోల్పోయి అసహనానికి గురవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాందీని సైతం వివాదంలోకి లాగారు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు చేయడంతో తాను టెస్టులకు సిద్ధమేనని చెప్పారు. కావాలంటే రాహుల్ గాంధీ సమక్షంలోనే టెస్టులు చేయించుకుంటానని చెప్పడంతో కేటీఆర్ కు గతంలో ఉన్న సహనం నశించిపోతోందని తెలుస్తోంది. టెస్టులను తప్పించుకోవడానికి ఆయన ఇలా ఆవేశంగా మాట్లాడుతున్నారని మరో వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తీరుపై నేతల్లో కూడా ఆందోళన నెలకొంది.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిద అని సంబోధించడంతో అది వారి ప్రైవేటు వ్యవహారమే అయినా అందులో కూడా వేలుపెట్టి రేవంత్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నించారు. దీంతో కేటీఆర్ పాత్రపై అందరిలో కూడా సందేహాలు వస్తున్నాయి. అధికార పక్షంలో ఉండి కూడా ఇంతలా భయపడుతున్నారంటే ఆయనకు ఏదో తెలియని భయం పట్టుకుందని చెబుతున్నారు.

ఈమధ్య కేటీఆర్ ప్రతి విషయానికి ఆందోళన చెందుతున్నారు. గతంతో కూల్ గా కనిపించే ఆయనలో ఈ మార్పుకు కారణాలేంటో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి కేటీఆర్ ను బయటకు తీసుకురావడానికే ఈ విధమైన ఆరోపణలతో ఆయనలో కోపం రావడానికి కారణమై ఉంటారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. నేతల్లో ఆలోచన ఉండాలే కానీ ఆవేశం ఉండకూడదని తెలిసినా కేటీఆర్ కు తెలియదా అని పార్టీలో చర్చలు వస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular