KTR- Etela Rajender: సభలో కేటీఆర్, ఈటల ఆలింగనం.. వైరల్ అవుతున్న వీడియో

KTR Etela Rajender: తెలంగాణ శాసనసభలో వినూత్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేత ఈటల రాజేందర్ ను పలకరించడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎదురుపడిన ఈటలను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. అన్నా అంటూ సంబోధించారు. దీంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కేసీఆర్ కు గిట్టని నాయకుడిగా ముద్ర పడిన ఈటలను కేటీఆర్ ఆలింగనం చేసుకోవడం అందరిని సంభ్రమాశ్చర్యంలోకి నెట్టింది. టీఆర్ఎస్ లో నెంబర్ […]

Written By: Srinivas, Updated On : March 8, 2022 3:46 pm
Follow us on

KTR Etela Rajender: తెలంగాణ శాసనసభలో వినూత్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేత ఈటల రాజేందర్ ను పలకరించడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎదురుపడిన ఈటలను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. అన్నా అంటూ సంబోధించారు. దీంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కేసీఆర్ కు గిట్టని నాయకుడిగా ముద్ర పడిన ఈటలను కేటీఆర్ ఆలింగనం చేసుకోవడం అందరిని సంభ్రమాశ్చర్యంలోకి నెట్టింది.

KTR- Etela Rajender

టీఆర్ఎస్ లో నెంబర్ టూ గా ఉన్న ఈటల రాజేందర్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురై తరువాత ఉప ఎన్నికలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. తరువాత జరిగిన పరిణామాల్లో ఆయన అధికార పార్టీని ఓడించి విజయపథంలో దూసుకుపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయిక సభ్యులందరిలో అనుమానాలకు తెరలేపుతోంది.

Also Read: 14న ‘జనసేన’లో ఏం జరగబోతుంది..? పవన్ కళ్యాణ్ సంచలన స్టెప్?

సభ ప్రారంభమైన తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను సభకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తూ నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లడంతో సీఎం కేసీఆర్ వారిని సభ నుంచి పంపించాల్సిందిగా సూచించడంతో స్పీకర్ వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లారు.

KTR- Etela Rajender

దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన ఏకపక్షంగా సాగుతుందని వాపోయారు. మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్న వారిపై బహిష్కరణ వేటు వేయడం సమంజసం కాదని హితవు పలికారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇలా వ్వవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజులలో బీజేపీనే రాష్ట్రంలో కీ రోల్ పోషించనుందని జోస్యం చెప్పారు. ఇవి జీర్ణించుకోలేకే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: కేసీఆర్ కు నిజంగా ఆ భయం పట్టుకుందా?

Tags