https://oktelugu.com/

జీహెచ్ఎంసీ ఎన్నికలపై పావులు కదుపుతున్న కేటీఆర్

కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టింది. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరిగిన కారు స్పీడు ముందు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన పాపానా పోలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ, సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ వన్ సైడ్ విక్టరీని సాధించింది. తెలంగాణలో కారు జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకటి, అర సీట్లతో నామమాత్ర పోటీనిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ […]

Written By: , Updated On : June 7, 2020 / 02:13 PM IST
Follow us on


కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టింది. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరిగిన కారు స్పీడు ముందు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన పాపానా పోలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ, సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ వన్ సైడ్ విక్టరీని సాధించింది. తెలంగాణలో కారు జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకటి, అర సీట్లతో నామమాత్ర పోటీనిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ మరో ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. 2021 జనవరిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.

టార్గెట్ ఫిక్స్ చేసుకున్న టీఆర్ఎస్..
తెలంగాణకు ఆయువుపట్టు హైదరాబాద్ మహానగరం. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీచేసి మేయర్ సీటును కైవసం చేసుకుంది. 150 కార్పొరేట్ స్థానాలకు గాను టీఆర్ఎస్ 99 సీట్లు కైవసం చేసుకోవడం గమనార్హం. 2016 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలో అంత బలంగా లేదు. ఆంధ్రావాళ్లు ఎక్కవగా నివసించే ప్రాంతాల్లో సైతం టీఆర్ఎస్ సత్తా చాటి ఏకంగా 99చోట్ల గులాబీ జెండాను రెపరెపలాడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ సత్తాచాటడానికి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కృషి కారణం. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజలకు కష్టాలను తెలుసుకొని అందుకనుగుణంగా మ్యానిఫెస్టోను రూపొందించి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే.

కేటీఆర్ మరోసారి సత్తా చాటుతారా?
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ అంతా తానై పార్టీని ముందుండి నడిపించారు. నాడు ఆయన ఐటీ మంత్రిగా ఉండగా నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కేటీఆర్ మరోసారి తన సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. ఈమేరకు గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ చెప్పిన మ్యానిఫెస్టో పనులను త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటిని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.

దీని తర్వాత నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజల మన్నలను పొందేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. వీటితోపాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ బీజీబీజీగా గడపాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి కేటీఆర్ మరోసారి సత్తా చాటుతారా? లేదా అనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా కిందటిసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరువు పొగట్టుకున్న కాంగ్రెస్, బీజీపీ పార్టీలు టీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే అందరికంటే ముందుగానే టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ముందుకు దూసుకెళుతుంటడం ఆసక్తిని రేపుతోంది.